చంద్రబాబుతో పవన్ సమావేశం.. అందుకోసమేనా..?

తెలంగాణలో ఏ విధంగా అయితే ప్రభుత్వ వ్యతిరేకతను ఉపయోగించుకొని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో.. అదేవిధంగా ఏపీలో కూడా ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చంద్రబాబు, పవన్ చర్చించుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement
Update: 2023-12-06 13:22 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ హైదరాబాద్‌లో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమ‌య్యారు. గత నెల 4న వీరిద్దరూ టీడీపీ - జనసేన ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చించేందుకు భేటీ అయ్యారు. నెలరోజుల తర్వాత మళ్లీ ఇప్పుడు సమావేశమ‌య్యారు. ఇటీవల తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెల్లడైన సంగతి తెలిసిందే. సుమారు పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌ను ఓడించిన కాంగ్రెస్.. అధికారం చేపట్టనున్న త‌రుణంలో చంద్రబాబు - పవన్ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

తెలంగాణలో ఏ విధంగా అయితే ప్రభుత్వ వ్యతిరేకతను ఉపయోగించుకొని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో.. అదేవిధంగా ఏపీలో కూడా ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చంద్రబాబు, పవన్ చర్చించుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చిన మూడు రోజులకే పవన్, చంద్రబాబు భేటీ కావడం చ‌ర్చ‌ణీయాంశంగా మారింది.

అలాగే రెండు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో, పొత్తు ప్రక్రియపై కూడా వీరిద్దరూ చర్చించుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు జైలు నుంచి విడుదలైన తర్వాత కొద్ది రోజులు ఇంటికే పరిమితం అయ్యారు. ఈనెల 11 నుంచి ప్రజల్లోకి వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లో నటిస్తున్నారు. సినిమాలకు సాధ్యమైనంత తొందరగా బ్రేక్ ఇచ్చి జనంలోకి వెళ్లేందుకు పవన్ కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News