పవన్ వర్సెస్ జగన్.. క్లాస్ వార్ మొదలైంది

జగన్ కి ఎన్ని ఆస్తిపాస్తులున్నాయో లెక్కచెప్పిన నాగబాబు, ఆయన పాపం పసివాడు కాదని, పాపం పేదవాడని ఆ వీడియోలో సెటైర్లు పేల్చారు.

Advertisement
Update: 2023-05-18 17:09 GMT

సీఎం జగన్ ని అప్పుడే వదిలేలా లేరు పవన్ కల్యాణ్. పాపం పసివాడు అనే టైటిల్ తో జగన్ ని హీరోగా పెట్టి సినిమా చేయాలంటూ ఉదయం సెటైర్లు వేసి, సాయంత్రానికి ఓ పోస్టర్ రెడీ చేసి.. కామెడీగా కౌంటర్లిచ్చిన జనసేనాని.. తాజాగా తన అన్న నాగబాబుతో మరింత హంగామా సృష్టించారు. కథాకళి పేరుతో ఓ కామెడీ చర్చను తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు, జనసేన అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ మధ్య చర్చ అంటూ ఈ వీడియో రూపొందించారు. వీడియో అంతా సీఎం జగన్ పై సెటైర్లు వేయడమే పనిగా పెట్టుకున్నారు. క్లాస్ వార్ అని సీఎం జగన్ చెప్పే మాటలతో చర్చ మొదలు పెట్టి, అసలు క్లాస్ వార్ అంటే ఏంటి.. జగన్ పేదవారు ఎలా అవుతారంటూ అటువైపు చర్చను మళ్లించారు.


జగన్ కి ఎన్ని ఆస్తిపాస్తులున్నాయో లెక్కచెప్పిన నాగబాబు, ఆయన పాపం పసివాడు కాదని, పాపం పేదవాడని ఆ వీడియోలో సెటైర్లు పేల్చారు. జగన్ అనుకుంటున్నట్టు అది క్లాస్ వార్ కాదని, క్యాష్ వార్ అయ్యుంటుందని అన్నారు. అసలు క్లాస్ వార్ అంటే జగన్ కు ఇలా అర్థమైందా అని నిజమైన క్లాస్ వార్ చేసిన నాయకులు అనుకుంటారని ఎద్దేవా చేశారు.

మొత్తమ్మీద పవన్ కల్యాణ్ మాత్రం సీఎం జగన్ ఇటీవల చేసిన విమర్శలతో బాగానే హర్ట్ అయినట్టున్నారు. అందుకే ఆ తర్వాత సిరీస్ ప్లాన్ చేశారు. జగన్ పై రోజుకో ట్వీట్ వేస్తూ విమర్శల డోస్ పెంచారు. వైసీపీని మరింత రెచ్చగొట్టేలా వీడియోలు రికార్డ్ చేసి మరీ ట్వీట్లు వేస్తున్నారు. దీనికి వైసీపీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. 

Tags:    
Advertisement

Similar News