అయ్యయ్యో పట్టాభి.. నాగబాబు సానుభూతి

థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురిచేశారని, ముఖానికి టవల్‌ చుట్టుకున్న ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా కొట్టారని, పట్టాభి చెబుతుంటే తనకు బాధ వేసిందని అన్నారు నాగబాబు.

Advertisement
Update: 2023-02-22 14:44 GMT

ఇటీవల చంద్రబాబు అనపర్తి పర్యటన విషయంలో జరిగిన ఆందోళనలపై జనసేనాని పవన్ కల్యాణ్ సీరియస్ గా రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలను చూసి ప్రభుత్వం జడుసుకుంటుందని అన్నారు పవన్. టీడీపీకి ఏ చిన్న నష్టం జరిగినా, కష్టం వచ్చినా వెంటనే ట్విట్టర్లో పవన్ యాక్టివ్ అవుతారనే విషయం కూడా తెలిసిందే. అయితే గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి, అనంతరం టీడీపీ నేతల అరెస్ట్ పై మాత్రం పవన్ ఇంకా నోరు మెదపలేదు. అయితే టీడీపీకి సపోర్ట్ గా ఇప్పుడు నాగబాబు ట్వీట్ వైరల్ అవుతోంది.

పట్టాభిపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం..

పట్టాభిపై జరిగిన దాడి ప్రజాస్వామ్య విరుద్ధం అంటూ ట్వీట్ చేశారు నాగబాబు. థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురిచేశారని, ముఖానికి టవల్‌ చుట్టుకున్న ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా కొట్టారని, పట్టాభి చెబుతుంటే తనకు బాధ వేసిందని అన్నారు నాగబాబు. పట్టాభి లాంటి ప్రజా ప్రతినిధులపై దాడిని ఖండిస్తున్నామని చెప్పారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వ్యక్తిగత ప్రతీకారం కోసం వైసీపీ వాడుకుంటోందని మండిపడ్డారు. దీనికి నిదర్శనం పట్టాభిపై జరిగిన దాడేనని చెప్పారు నాగబాబు.


అధికారికంగా పొత్తులు ఖరారు కాకపోయినా ప్రస్తుతం టీడీపీ, జనసేన మాత్రం కలసి నడుస్తున్నాయనే విషయం స్పష్టమవుతోంది. టీడీపీకి నొప్పి తగిలితే వెంటనే జనసేనాని నుంచి రియాక్షన్ మొదలవుతుంది. పవన్ పై వైసీపీ విమర్శలు సంధిస్తే, వెంటనే చంద్రబాబు కౌంటర్ ఇస్తుంటారు. ప్రస్తుతానికి ఈ స్నేహం ఇలా కొనసాగుతోంది. గన్నవరం ఎపిసోడ్ పై పవన్ కల్యాణ్ స్పందించకపోయినా, పట్టాభికి మద్దతుగా నాగబాబు తెరపైకి రావడం విశేషం.

Tags:    
Advertisement

Similar News