అంబేద్కర్ ని అవమానించిన పచ్చ మీడియా..

గతంలో అసెంబ్లీ సాక్షిగా కాల్ మనీ సెక్స్ రాకెట్ అంశాన్ని డైవర్ట్ చేయడానికి అంబేద్కర్ విగ్రహం అంశాన్ని చంద్రబాబు వాడుకున్నారని గుర్తు చేశారు రోజా. 100 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతానని చెప్పి దళితులను మోసం చేశారన్నారు.

Advertisement
Update: 2024-01-20 13:05 GMT

విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ నిలువెత్తు విగ్రహావిష్కరణ అంగరంగ వైభవంగా జరిగింది. సోషల్ మీడియాలో ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం హైలైట్ గా నిలిచింది. సీఎం జగన్ రావడం, బహిరంగ సభ, డ్రోన్లతో భారీ లేజర్ షో.. అదిరిపోయింది. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాకి మాత్రం ఇవేవీ పట్టలేదు. కారణం అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించడం వారికి ఇష్టం లేదు. ఇదే విషయంపై మంత్రి రోజా మండిపడ్డారు. రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ అంటే పచ్చపత్రికలకు గౌరవం లేదా అని నిలదీశారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చూపించేందుకు వారికి మనసెందుకు రాలేదని ప్రశ్నించారు. అంబేద్కర్‌కు నిజమైన వారసుడు సీఎం జగన్‌ అని అన్నారు రోజా.

సీఎం జగన్‌ ని రాష్ట్ర ప్రజలంతా అభినందిస్తుంటే పచ్చ మీడియా తట్టుకోలేకపోతోందని విమర్శించారు మంత్రి రోజా. పచ్చ మీడియాను, పచ్చ పత్రికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. శుక్రవారం పండగలా జరిగిన కార్యక్రమాన్ని ఎల్లో మీడియా కవర్ చేయలేదని, ఒక్క నిమిషం కూడా అంబేద్కర్‌ను చూపించలేకపోయారని విమర్శించారు. అంబేద్కర్‌ను పచ్చమీడియా అవమానించిందని, అంబేద్కర్‌కు అండగా నిలబడిన వర్గాలను కూడా అవమానించిందని ధ్వజమెత్తారు.

గతంలో అసెంబ్లీ సాక్షిగా కాల్ మనీ సెక్స్ రాకెట్ అంశాన్ని డైవర్ట్ చేయడానికి అంబేద్కర్ విగ్రహం అంశాన్ని చంద్రబాబు వాడుకున్నారని గుర్తు చేశారు రోజా. 100 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతానని చెప్పి దళితులను మోసం చేశారన్నారు. ఒక్క విగ్రహం కూడా పెట్టలేదని చెప్పారు. ప్రచారాలు, సమస్యల డైవర్షన్‌కు చంద్రబాబు అంబేద్కర్‌ను వాడుకున్నారని విమర్శించారు. తోపు.. తురుము అని చెప్పుకునే చంద్రబాబు విజయవాడ నడిబొడ్డులో ఏరోజైనా ఇలాంటి కార్యక్రమం చేయగలిగారా? అని ప్రశ్నించారు రోజా.

Tags:    
Advertisement

Similar News