చంద్రబాబు రాజకీయ వికలాంగుడు -పెద్దిరెడ్డి

అబద్ధాల చంద్రబాబు చేతిలో ఎన్నోసార్లు మోసపోయిన ప్రజలు.. అమలు సాధ్యం కాని సూపర్‌ సిక్స్‌ హామీలను నమ్మే పరిస్థితి లేదని చెప్పారు మంత్రి పెద్దిరెడ్డి.

Advertisement
Update: 2024-03-14 01:28 GMT

చంద్రబాబు రాజకీయ వికలాంగుడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వికలాంగుడు కాబట్టే ఊతకర్రలుగా బీజేపీ, జనసేన పార్టీలను పెట్టుకుని ఎన్నికలకు సిద్ధమవుతున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో నిబద్ధత లేకుండా సొంత మామకే వెన్నుపోటు పొడిచిన దుర్మార్గుడు చంద్రబాబు అని విమర్శించారాయన. అబద్ధాల చంద్రబాబు చేతిలో ఎన్నోసార్లు మోసపోయిన ప్రజలు.. అమలు సాధ్యం కాని సూపర్‌ సిక్స్‌ హామీలను నమ్మే పరిస్థితి లేదని చెప్పారు మంత్రి పెద్దిరెడ్డి.

2014 ఎన్నికల సమయంలో రైతు రుణమాఫీ, బంగారు రుణాల రద్దు, ఇంటికో ఉద్యోగం ఇస్తామని నిరుద్యోగులను, రైతులను, మహిళలను చంద్రబాబు మోసం చేశారని గుర్తు చేశారు మంత్రి పెద్దిరెడ్డి. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ తరపున ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి సీఎం జగన్ మళ్లీ ధైర్యంగా ఎన్నికలకు వస్తున్నారని, వారిద్దరి మధ్య తేడా అదేనన్నారు పెద్దిరెడ్డి. ఈసారి కూడా వైసీపీ మేనిఫెస్టోలో సాధ్యమయ్యే హామీలనే పొందుపరిచామని, తమ మేనిఫెస్టో బయటకు వస్తే కూటమికి షాక్ తగిలినట్టవుతుందని చెప్పారు.

కూటమి కట్టినా మాదే విజయం..

జగన్ కు వ్యతిరేకంగా ఎవరెవరు ఎన్నెన్ని కూటములు కట్టినా అంతిమ విజయం వైసీపీదేనని చెప్పారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కూటమి వల్ల వారికి కొత్తగా వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదన్నారు. వైసీపీకి ఫిక్స్ డ్ ఓటు బ్యాంక్ ఉందని, రాష్ట్రంలో జగన్ పథకాల ద్వారా లబ్ధిపొందిన ప్రతి ఒక్కరూ తమకు అండగా ఉంటారని అన్నారు. వైనాట్ 175 అంటూ ధీమాగా ప్రజల్లోకి వెళ్తున్నామని, పార్టీలకతీతంగా ప్రతి నియోజకవర్గంలోనూ లబ్ధిదారులకు మంచి చేశామని చెప్పారు మంత్రి పెద్దిరెడ్డి.

Tags:    
Advertisement

Similar News