పవర్ స్టార్.. పవర్ స్టార్ అనడం కాదు.. పవర్ షేర్ గురించి నోరెత్తరే..?

తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ - జనసేన ఉమ్మడి ఎన్నికల సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ.. ఎప్పటిలాగే రొటీన్ డైలాగులు పేల్చారు.

Advertisement
Update: 2024-02-28 15:33 GMT

ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా జ‌న‌సేన‌కు టీడీపీ కేవలం 24 సీట్లు మాత్రమే కేటాయించడంతో ఆ పార్టీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జనసేనకు పవర్ షేర్ కూడా ఇవ్వాలని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాపు నాయకులు డిమాండ్ చేస్తుండగా, టీడీపీ మాత్రం ఆ విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు.

ఇవాళ తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ - జనసేన ఉమ్మడి ఎన్నికల సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ.. ఎప్పటిలాగే రొటీన్ డైలాగులు పేల్చారు. వైసీపీ హయాంలో అమరావతికి అన్యాయం జరిగిందని, రాయలసీమ అభివృద్ధి గురించి పట్టించుకోలేదని, సినిమా వారికి అన్యాయం జరిగిందని చంద్రబాబు మాట్లాడారు. మచ్చుకైనా జనసేనకు అధికారంలో కూడా వాటా ఉంటుందని చంద్రబాబు చెప్పలేదు. దీనిపై పవన్ అభిమానులతో పాటు కాపు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు స్పీచ్ పై మంత్రి అంబటి రాంబాబు కూడా ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. తాడేపల్లిగూడెం సభలో చంద్రబాబు పవన్ ను పొగడటమే పనిగా పెట్టుకున్నారని.. పవర్ షేరింగ్ గురించి మాత్రం మాట్లాడలేదని అన్నారు. చంద్రబాబు చేతిలో మోసపోవద్దని జన సైనికులకు ఆయన సూచించారు.

'పవర్ స్టార్, పవర్ స్టార్ అని పొగడటమేగాని "పవర్ షేర్" గురించి మాత్రం మాట్లాడరు. మోసపోకండి జనసైనికులారా' అని మంత్రి అంబటి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags:    
Advertisement

Similar News