'మహా దోపిడీ'.. బాబు చరిత్ర పుస్తక రూపంలో

చంద్రబాబు హయాంలో జరిగిన దోపిడీలను ఈ పుస్తకం వివరిస్తుందని అన్నారు సజ్జల. ఆయన వ్యవస్థలను గుప్పెట పట్టిన తీరుని కూడా ఇందులో సమగ్రంగా వివరించారని చెప్పారు.

Advertisement
Update: 2024-03-21 09:27 GMT

చంద్రబాబు మహే మేధావి, దేశోద్ధారకుడని పొగుడుతూ ఇప్పటి వరకూ చాలా పుస్తకాలే వచ్చాయి. ఈ సీజన్లో కూడా రెండు పుస్తకాలు రిలీజయ్యాయి. 'డీకోడింగ్ ద లీడర్', 'మహా స్వాప్నికుడు' అంటూ ఆయన భజన బృందం రెండు పుస్తకాలను అచ్చు వేయించింది. అయితే బాబు చరిత్ర తెలుసుకోవాలంటే చదవాల్సిన అసలు పుస్తకం వేరే ఉందంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబుపై రాసిన 'మహా దోపిడీ' అనే పుస్తకాన్ని ఆయన విడుదల చేశారు. జర్నలిస్ట్ విజయబాబు ఈ పుస్తకాన్ని రాశారు.

చంద్రబాబు హయాంలో జరిగిన దోపిడీలను ఈ పుస్తకం వివరిస్తుందని అన్నారు సజ్జల. ఆయన వ్యవస్థలను గుప్పెట పట్టిన తీరుని కూడా ఇందులో సమగ్రంగా వివరించారని చెప్పారు. జన్మభూమి కమిటీలతో చంద్రబాబు దోపిడీకి పాల్పడ్డ విధానం కూడా ఈ పుస్తకంలో వివరంగా ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర నిధులను ఎలా దోచేశారో క్లియర్‌గా చెప్పారన్నారు. దేశానికి అవినీతిని పరిచయం చేసింది కూడా చంద్రబాబేనన్నారు సజ్జల. ఆఖరుకి కుటుంబంలోని మహిళలను కూడా రాజకీయం కోసం వాడుకున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయం అంటే దోపిడీ అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరించేవారని, అధికారం కోసం ఇప్పుడు పవన్‌, బీజేపీని వాడుకుంటున్నారని కౌంటర్ ఇచ్చారు. షర్మిల స్క్రిప్ట్ కూడా చంద్రబాబు నుంచి వెళ్తున్నదేనని అన్నారు. అధికారం కోసం చంద్రబాబు చేస్తున్న ఆఖరి ప్రయత్నం ఇదని అన్నారు సజ్జల.

250 పేజీల్లో చంద్రబాబు దోపిడీనంతా ఈ పుస్తకంలో పొందుపరిచారు రచయిత. గద్దల్లా దోపిడీలు చేసిన వారు ఇప్పుడు సుద్దులు చెబుతున్నారని, అందుకే ఈ పుస్తకం రాయాల్సి వచ్చిందన్నారు. చంద్రబాబు కుహనా రాజకీయాలను తాను దగ్గరగా చూశానన్నారు. చంద్రబాబు "స్కిల్ బిల్ పాండే" అని, ఆయన మళ్లీ వస్తే దోపిడీ రాజ్యం వస్తుందన్నారు. తొక్కేస్తానంటూ విర్రవీగిన పవన్ కళ్యాణ్ చివరికి తన కార్యకర్తలనే తొక్కేశారని చెప్పారు పుస్తక రచయిత విజయబాబు.

Tags:    
Advertisement

Similar News