సోము వీర్రాజుపై కన్నా ఫైర్

సోము వీర్రాజు మాత్రం అన్ని తానొక్కడే చూస్తున్నారని విమర్శించారు. ఎవరితోనూ ఆయన చర్చించడం లేదన్నారు. కాబట్టి దూరం నుంచి చూస్తున్న వ్యక్తిగా పవన్‌ కల్యాణ్‌ను సమన్వయం చేసుకోవడంలో సోము వీర్రాజు విఫలమైనట్టుగా అనిపిస్తోందన్నారు.

Advertisement
Update: 2022-10-19 10:10 GMT

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్‌ను సమన్వయం చేసుకోవడంలో ఏపీ బీజేపీ నాయకత్వం విఫలమైందని వ్యాఖ్యానించారు. ఈ అభిప్రాయం తనకు ఇది వరకే ఉందని.. ఇప్పుడు బహిరంగంగా చెబుతున్నానని వ్యాఖ్యానించారు. అసలు ఏపీ బీజేపీలో ఏం జరుగుతోందో కూడా తమకు తెలియడం లేదన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెండు నెలలకోసారి పార్టీ నేతల సమావేశం జరిగేదని.. అన్ని విషయాలపై పార్టీ నేతలతో చర్చించే వాడినన్నారు.

సోము వీర్రాజు మాత్రం అన్ని తానొక్కడే చూస్తున్నారని విమర్శించారు. ఎవరితోనూ ఆయన చర్చించడం లేదన్నారు. కాబట్టి దూరం నుంచి చూస్తున్న వ్యక్తిగా పవన్‌ కల్యాణ్‌ను సమన్వయం చేసుకోవడంలో సోము వీర్రాజు విఫలమైనట్టుగా అనిపిస్తోందన్నారు. హైకమాండ్‌కు ఈ విషయం ఇదివరకే తెలిసే పవన్‌ కల్యాణ్‌ను కేంద్ర నాయకుడైన మురళీధర్‌రావు సమన్వయం చేసుకుంటారని చెప్పినట్టు తనకు తెలిసిందన్నారు. విపక్షాలన్నీ ఏకమై జగన్‌పై పోరాటం చేయాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు.

ఫ్యాక్షనిజం, విలనిజం, శాడిజం కలిసి ఉన్న వ్యక్తి జగన్‌ అని, అందుకే తాను తప్ప మరెవరూ అవసరం లేదన్న లెక్కలేనితనంతో పాలన చేస్తున్నారని కన్నా విమర్శించారు.

Tags:    
Advertisement

Similar News