ఏపీలో బీఆర్ఎస్ టికెట్ల కోసం హెవీ కాంపిటీషన్..

ఏపీలో 2024 ఎన్నికల్లో బీజేపీకి అభ్యర్థులు దొరకరేమో కానీ బీఆర్ఎస్‌కి మాత్రం కచ్చితంగా అభ్యర్థులు దొరుకుతారని తేలిపోయింది. కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉంటుందని అర్థమైపోయింది.

Advertisement
Update: 2022-10-07 10:07 GMT

బీఆర్ఎస్ ప్రకటన రోజు ఏపీలో శుభాకాంక్షల బ్యానర్లు వెలిశాయి. ఏపీలో కేసీఆర్‌కి ఆ మాత్రం ఫాలోయింగ్ ఉందిలే అనుకున్నారంతా. అయితే ఇప్పుడు ఏకంగా టిక్కెట్లు కన్ఫామ్ చేసుకుంటూ కొంతమంది బ్యానర్లు వేసుకుంటున్నారు. అమలాపురం లోక్‌సభ సీటు తమదే అంటూ అక్కడ ఓ బ్యానర్ బయట పడింది. అమలాపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి రేవు అమ్మాజీరావు డబుల్ ఎంఏ పేరుతో ఈ బ్యానర్లు పెట్టారు. అంటే ముందుగానే ఏపీలో బీఆర్ఎస్ తరపున టికెట్లు కన్ఫర్మ్ చేసుకుంటున్నారనమాట.

ఏపీలో బీఆర్ఎస్ ప్రభావం ఏమీ ఉండదని అధికార, ప్రతిపక్ష పార్టీలు చెప్పుకుంటున్న సందర్భంలో ఇలా బీఆర్ఎస్ తరపున అభ్యర్థులు పుట్టుకు రావడం విశేషం. ఏపీలో వైసీపీలో టికెట్ల కొట్లాట ఎలాగూ ఉంటుంది. టీడీపీపై జనానికి విశ్వాసం పెరుగుతుందనే ఆశ కూడా లేదు. హోదా పాపం బీజేపీని వదిలిపెట్టదు. జనసేనపై కుల పార్టీ అనే ముద్ర పడే అవకాశం కనపడుతోంది. ఈ దశలో ఆశావహులకు బీఆర్ఎస్ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది.

రాష్ట్ర విభజన సమయంలో ఏపీ ప్రజలకు కేసీఆర్‌పై సదభిప్రాయం లేకపోయినా.. విభజన తర్వాత తెలంగాణలోని ఏపీ ప్రజలకు కేసీఆర్ దేవుడిలా మారారు. సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా సెటిలర్లు వివక్షకు గురి కాలేదు. పైగా విభజన తర్వాత కేసీఆర్ హయాంలో తెలంగాణ మరింత అభివృద్ధి చెందడంతో ఏపీలో కూడా టీఆర్ఎస్ మోడల్ అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. ఏపీలో 2024 ఎన్నికల్లో బీజేపీకి అభ్యర్థులు దొరకరేమో కానీ బీఆర్ఎస్‌కి మాత్రం కచ్చితంగా అభ్యర్థులు దొరుకుతారని తేలిపోయింది. కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉంటుందని అర్థమైపోయింది. అధికార పార్టీ రెబల్ అభ్యర్థులు, టీడీపీని కాకుండా బీఆర్ఎస్‌ని ఎంపిక చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు.

Tags:    
Advertisement

Similar News