చంద్రబాబు నైజం ఇదీ... అవసరమైతే ప్రాధేయపడడం, అవసరం తీరాక తిట్టడం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తమకు మద్దతు ఇవ్వాలని, తమకు సాయం చేయాలని ఇటీవల చంద్రబాబు ప్రశాంత్‌ కిశోర్‌ను ప్రాధేయపడిన విషయం తెలిసిందే.

Advertisement
Update: 2024-02-04 03:27 GMT

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అవసరం కోసం ఎవరి వద్దకైనా వెళ్తారు. అవసరం లేనప్పుడు తిట్టిపోసి, అవసరం వచ్చినప్పుడు ప్రాధేయపడడం ఆయనకు అలవాటే. అది ఆయన నైజం కూడా. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ విషయంలో ఆయన అదే పనిచేశారు. ప్రశాంత్‌ కిశోర్‌ను చంద్రబాబు ఒక సందర్భంలో బిహార్‌ బందిపోటుగా అభివర్ణించారు. ప్రశాంత్‌ కిశోర్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో దొంగ ఓట్లను చేర్పించారని, హైదరాబాద్‌లోని తమ డేటాను చోరీ చేశారని చంద్రబాబు దుమ్మెత్తిపోశారు. అయితే, ఇటీవల ప్రశాంత్‌ కిశోర్‌ సాయాన్ని అర్థించారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తమకు మద్దతు ఇవ్వాలని, తమకు సాయం చేయాలని ఇటీవల చంద్రబాబు ప్రశాంత్‌ కిశోర్‌ను ప్రాధేయపడిన విషయం తెలిసిందే. చంద్రబాబుతో భేటీ కోసం ప్రశాంత్‌ కిశోర్‌ను నారా లోకేష్‌ ప్రత్యేక విమానంలో విజయవాడకు తీసుకుని వెళ్లారు. ఆ ప్రత్యేక విమానాన్ని బీజేపీలోని చందబ్రాబు పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్‌కు చెందింది. బీజేపీలో ఉంటూనే చంద్రబాబు కోసం సీఎం రమేష్‌ పనిచేస్తున్నారనేది బహిరంగ రహస్యమే.

ఆ విషయాన్ని అలా ఉంచితే, చంద్రబాబు తిట్ల గురించి ఓ టీవీ ఛాన‌ల్‌ ప్రతినిధి గుర్తుచేయగా.. ప్రశాంత్‌ కిశోర్‌ నవ్వేసి.. ఓడిపోయినప్పుడు కోపం రావడం ఎవరికైనా సహజమని అన్నారు. తనకు సహాయం చేయాలని, తనకు మద్దతు ఇవ్వాలని చంద్రబాబు తనను కోరారని, అందుకు తాను నిరాకరించానని ప్రశాంత్‌ కిశోర్‌ చెప్పారు.

గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీని కూడా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా పనిచేశారు. ఇప్పుడు బీజేపీతో కాళ్లబేరానికి సిద్ధపడుతున్నారు. చంద్రబాబు నీతి లేని రాజకీయం ఇది. ఆయన నైజం కూడా అదే.

Tags:    
Advertisement

Similar News