నారా భువనేశ్వరికి ఎన్నికల కమిషన్‌ నోటీసులు

అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఈనెల 20న ఈ ఘటన జరిగిందని, ఇది ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమేనని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement
Update: 2024-03-24 03:49 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరికి ఎన్నికల కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఆమె తన పర్యటనలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని వెల్లడించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం శనివారం ఈ వివరాలు తెలిపింది. అంతేకాదు.. నారా భువనేశ్వరి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంపై 24 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది.

ఇంతకీ ఏం జరిగిందంటే.. అన్నమయ్య జిల్లాలో ‘నిజం గెలవాలి’ పేరుతో పర్యటిస్తున్న నారా భువనేశ్వరి ఓటర్లను ఆకట్టుకునేలా ఆర్థిక సహాయం పేరుతో నగదును పంపిణీ చేస్తున్నారు. దీనిపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఈనెల 20న ఈ ఘటన జరిగిందని, ఇది ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమేనని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 21న దీనిపై ఆధారాలతో ఆయన ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు అందించారు. ఈ నేపథ్యంలో దీనిపై మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ ప్రకారం విచారణ జరిపి 24 గంటల్లోగా తమకు నివేదిక పంపాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌కు సీఈవో ఆదేశాలు జారీ చేశారు.

Tags:    
Advertisement

Similar News