అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడికి ఈసీ నోటీసులు

టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మార్చి 31న ఎమ్మిగనూరు సభలో చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.

Advertisement
Update: 2024-04-05 14:14 GMT

టీడీపీ నేతలు అచ్చెన్నాయడు, అయ్యన్నపాత్రుడికి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు తప్పుడు ఆరోపణలు చేశారు. ట్విట్టర్, ఫేస్‌బుక్ ద్వారా తప్పుడు ఆరోపణలు చేసిన టీడీపీ నేతలపై వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో కోడ్ ఉల్లంఘనపై వివరణ కోరుతూ అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడికి సీఈవో ముఖేష్‌కుమార్‌ మీనా నోటీసులు ఇచ్చారు.

టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మార్చి 31న ఎమ్మిగనూరు సభలో చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. చంద్రబాబు ఎన్నికల కోడ్‌ నియమావళిని ఉల్లంఘించారని అందిన ఫిర్యాదుతో ఈసీ నోటీసులు ఇచ్చింది. 48 గంటల్లోగా అఫిడవిట్‌ రూపంలో వివరణ ఇవ్వాలని ఈసీ పేర్కొంది.

Tags:    
Advertisement

Similar News