జగన్‌పై ఏడుపెందుకు, నీకు దమ్ముందా నారా లోకేష్‌..?

బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి దిగజారుతోంది. ఈ స్థితిలో నారా లోకేష్‌కు కేంద్రాన్ని తప్పు పట్టే దమ్ము ఉంటుందని అనుకోలేం గానీ, జగన్‌ మీద పడి ఏడవడం ఎందుకనేది ప్రశ్న.

Advertisement
Update: 2024-02-20 12:32 GMT

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ గత పది రోజులుగా ఉత్తరాంధ్రలో శంఖారావం సభల్లో పాల్గొంటున్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై మాట్లాడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కును కొనుగోలు చేస్తామని హామీ ఇస్తున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కేంద్రంపై మాట్లాడడం లేదని ఆయన విమర్శిస్తున్నారు. ఇక్కడే నారా లోకేష్‌ తన అజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నారు.

బీజేపీనీ, కేంద్ర ప్ర‌భుత్వాన్ని వ్యతిరేకించే దమ్ము నారా లోకేష్‌కు ఏ మాత్రం లేదని అర్థం చేసుకోవచ్చు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఆయనెందుకు కేంద్రాన్ని తప్పు పట్టడం లేదో ఎవరికీ అర్థం కాదని ఆయన అనుకుంటున్నారా..? ప్రైవేటీకరణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామని కూడా ఆయన స్పష్టంగా చెప్పడం లేదు. టీడీపీ ప్రస్తుతం బీజేపీతో పొత్తు కోసం కాళ్లబేరానికి వచ్చింది. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి దిగజారుతోంది. ఈ స్థితిలో నారా లోకేష్‌కు కేంద్రాన్ని తప్పు పట్టే దమ్ము ఉంటుందని అనుకోలేం గానీ, జగన్‌ మీద పడి ఏడవడం ఎందుకనేది ప్రశ్న. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ జగన్‌ కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని లోకేష్ మ‌ర్చిపోయారా..?

విశాఖ ఉక్కు గురించి మాట్లాడుతున్న నారా లోకేష్‌ విశాఖ రైల్వే జోన్‌ గురించి గానీ విశాఖ మెట్రో రైలు గురించి గానీ ఎందుకు మాట్లాడడం లేదు. ఈ రెండు అంశాలపై కేంద్రాన్ని ఎందుకు విమర్శించడం లేదు. కేవలం ధైర్యమూ, దమ్ము లేకనే కేంద్రంపై విమర్శలు చేయడం లేదు. ఆ రెండింటిపై మాట్లాడితే నారా లోకేష్‌ మాటలకు విలువ వుండేది. ఇప్పుడా విలువ లేదు.

Tags:    
Advertisement

Similar News