అనకాపల్లిలో నాగబాబు చేతులెత్తేశారా..?

అనకాపల్లి నుంచి లోక్‌సభకు పోటీ చేసే ఉద్దేశంతో నాగబాబు స్థానికంగా అచ్చుతాపురంలో ఇల్లు తీసుకున్నారు. సమీక్షలు నిర్వహించారు. చాలా హంగామానే సృష్టించారు.

Advertisement
Update: 2024-03-02 11:19 GMT

తన సోదరుడు నాగబాబును కేంద్రంలో మంత్రిని చేస్తానని, అనకాపల్లి నుంచి పార్లమెంటుకు ఆయన పోటీ చేస్తారని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. నాగబాబు కోసం కొణతాల రామకృష్ణకు అనకాపల్లి అసెంబ్లీ సీటును కేటాయించారు. నిజానికి, కొణతాల రామకృష్ణ అనకాపల్లి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాలని అనుకున్నారు.

అనకాపల్లి నుంచి లోక్‌సభకు పోటీ చేసే ఉద్దేశంతో నాగబాబు స్థానికంగా అచ్చుతాపురంలో ఇల్లు తీసుకున్నారు. సమీక్షలు నిర్వహించారు. చాలా హంగామానే సృష్టించారు. సర్వేలు కూడా చేయించుకున్నట్లు తెలుస్తోంది. పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో ఆయన చేతులెత్తేసినట్లు చెప్పుతున్నారు. ఆయన తన మకాంను అనకాపల్లి నుంచి తిరిగి హైదరాబాద్‌కు మార్చుకున్నారు. దీంతో ఆయన పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

పవన్‌ కల్యాణ్‌ కూడా తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో కలిసి అభ్యర్థుల జాబితాను ప్రకటించిన తర్వాత హైదరాబాద్‌కు వెళ్లారు. చంద్రబాబు 94 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించగా పవన్‌ కల్యాణ్ ఐదుగురి పేర్లను మాత్రమే ప్రకటించారు. అందులో ఆయన పేరు కూడా లేదు. పవన్‌ కల్యాణ్‌ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే స్పష్టత ఇప్పటి వరకు రాలేదు. మిగతా అభ్యర్థుల ఎంపికపై ఆయన కసరత్తు చేసినట్లుగా కూడా కనిపించడం లేదు.

Tags:    
Advertisement

Similar News