పవన్ కల్యాణ్ కి చంద్రబాబు అంతలా బ్రెయిన్ వాష్ చేశారా..?

రణస్థలంలో పవన్ ప్రసంగం విన్నవారెవరికైనా ఆయన ఒంటరి పోరుకి బాగా భయడుతున్నారనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఒంటరిగా పోటీ చేసి వీర మరణం పొందాల్సిన అవసరం లేదని అన్నారంటే, వీరమరణం ఖాయమని ఆయనకు అర్థమైందా..?

Advertisement
Update: 2023-01-13 07:59 GMT

రణస్థలం సభతో పవన్ కల్యాణ్ పొత్తులపై క్లారిటీ ఇచ్చేశారు. అసలు ఈ సభ యువత కోసం కాదు, చంద్రబాబు సంకలో ఎందుకు దూరాల్సి వస్తుందో చెప్పడానికే పవన్ సభ పెట్టుకున్నారంటూ మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. పవన్ ప్రసంగం విన్నవారెవరికైనా ఇదే క్లారిటీ వస్తుంది. కేవలం పొత్తులపై తేల్చి చెప్పేందుకే పవన్ సభ పెట్టినట్టు అనిపిస్తుంది. గతంలో చంద్రబాబుని తిట్టిన పవన్, ఇప్పుడు ఆయనకు ఎందుకు మద్దతిస్తున్నారనే ప్రశ్నకు కూడా ఈ సభలోనే సమాధానమిచ్చారు. అత్తతోనో, పక్కింటివారితోనో గొడవపడితే మాట్లాడటం మానేస్తామా.. సర్దుకుపోకపోతే ఎలా అని అన్నారు పవన్. అంటే జనసేనాని కచ్చితంగా టీడీపీతో కలసి వెళ్లేందుకే నిర్ణయించారు. దాన్ని సమర్థించుకోడానికే సభ పెట్టారు.

పవన్ ని భయపెట్టారా..?

రణస్థలంలో పవన్ ప్రసంగం విన్నవారెవరికైనా ఆయన ఒంటరి పోరుకి బాగా భయడుతున్నారనే విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఒంటరిగా పోటీ చేసి వీర మరణం పొందాల్సిన అవసరం లేదని అన్నారంటే, వీరమరణం ఖాయమని ఆయనకు అర్థమైందా..? బలం సరిపోతుందనుకుంటే ఒంటరిగానే పోటీ చేస్తాం.. ఆ నమ్మకం మీరిస్తారా అని పార్టీ కార్యకర్తల్నే ప్రశ్నించారు పవన్. అంటే పొత్తులు లేకపోతే మనం గెలవలేం అనే విషయాన్ని వారికి కూడా పవన్ నూరిపోస్తున్నట్టే లెక్క. ప్రజలందరినీ హింసించే పాలకుడిని ఎదుర్కోవాలంటే.. మనకు పడని శత్రువులతోనూ కలవాల్సిందే అనే డైలాగ్ కూడా కొట్టారు పవన్. అంటే గతంలో తాను చంద్రబాబుతో విభేదించినా, ఇప్పుడు పొత్తు తప్పడంలేదని ఆయన చెప్పదలచుకున్నారు. చెప్పేశారు.

ఎందుకీ మార్పు..?

చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ తర్వాతే పవన్ లో ఈ మార్పు స్పష్టంగా తెలుస్తోంది. గతంలో పొత్తుల్లేకపోయినా ఒంటరిపోరుకి సిద్ధంగా ఉండాలని జనసైనికులకు సిగ్నల్స్ ఇచ్చిన పవన్, ఇప్పుడు పొత్తులు లేకపోతే మనకు వీరమరణమే గతి అనే స్థాయికి వచ్చేశారు. అంటే ఆ రేంజ్ లో పవన్ కి చంద్రబాబు బ్రెయిన్ వాష్ చేశారా అనే అనుమానం రాకమానదు. 2019 ఎన్నికల్లో కూడా ఒంటరి పోరుతో నష్టపోయారని, ఇప్పుడు కూడా అలాంటి రిస్క్ చేయొద్దని సూచించి ఉంటారు బాబు. పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా అనేది తర్వాతి విషయం.. టీడీపీతో పొత్తు పెట్టుకుని, కనీసం తాను ఎమ్మెల్యేని అయినా అసెంబ్లీలోకి ఎంట్రీ ఉంటుంది కదా అనేది ఈసారి పవన్ ఆలోచన. అందుకే జనసైనికుల్ని కూడా ఆయన మెంటల్ గా ప్రిపేర్ చేశారు. రణస్థలం సభతో పొత్తులు కచ్చితంగా ఉంటాయని సంకేతాలిచ్చారు. ఇక సీట్ల విషయంలో కూడా పవన్ పెద్దగా పట్టుబట్టకపోవచ్చు. జగన్ ని దించాలి, దించాలి అంటున్న పవన్, జనసైనికులు త్యాగాలు చేయాలి చేయాలి అనే స్థాయికి తెచ్చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News