ప్రతి గింజా కొనుగోలు చేసే బాధ్య‌త ప్ర‌భుత్వానిది

రైతుల వద్దనున్న ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు పంపే బాధ్యతను పౌరసరఫరాల శాఖ అధికారులు తీసుకుంటారని సీఎం జగన్‌ చెప్పారు.

Advertisement
Update: 2023-12-13 02:23 GMT

తుపాను ప్రభావంతో పంట దెబ్బతిన్న రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ చెప్పారు. రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేస్తోందని ఆయన చెప్పారు. ప్రతి గింజనూ కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలు, రంగుమారిన వరి ధాన్యం కొనుగోలుపై తుపాను ప్రభావిత ప్రాంతాల ఎమ్మెల్యేలు, అధికారులతో మంగళవారం సాయంత్రం సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం జగన్‌.. ఈ వ్యాఖ్యలు చేశారు.

రైతుల వద్దనున్న ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు పంపే బాధ్యతను పౌరసరఫరాల శాఖ అధికారులు తీసుకుంటారని సీఎం జగన్‌ చెప్పారు. రైతు భరోసా కేంద్రాల వారీగా ఈ కొనుగోళ్లు జరుగుతాయని ఆయన వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్యూమరేషన్‌ ప్రక్రియ ప్రారంభించారా.. అంటూ ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆరా తీశారు. దీనిపై అధికారులు స్పందిస్తూ.. ఈ నెల 11 నుంచి ఎన్యూమరేషన్‌ ప్రక్రియ ప్రారంభమైందని, 18 వరకు కొనసాగుతుందని వివరించారు. ఆ తర్వాత ఈ నెల 19 నుంచి 22 వరకు సోషల్‌ ఆడిట్‌ కోసం రైతు భరోసా కేంద్రాల్లో జాబితాలు అందుబాటులో ఉంచుతామని సీఎంకి తెలిపారు.

Tags:    
Advertisement

Similar News