గవర్నర్ కు సీఎం జగన్ ఆత్మీయ వీడ్కోలు..

మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం తరపున గవర్నర్ కు విజయవాడలో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు గవర్నర్, గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి వెళ్లే క్రమంలో సీఎం జగన్ స్వయంగా వచ్చి పాదాభివందనం చేయడం విశేషం.

Advertisement
Update: 2023-02-22 05:55 GMT

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు సీఎం జగన్ ఆత్మీయ వీడ్కోలు పలికారు. మూడున్నరేళ్లపాటు ఆయన ఏపీకి గవర్నర్ గా పనిచేసి, ప్రస్తుతం చత్తీస్ ఘడ్ కు బదిలీపై వెళ్తున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ గన్నవరం ఎయిర్ పోర్ట్ లో గవర్నర్ కు వీడ్కోలు పలికారు. ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి పాదాభివందనం చేశారు.





సీఎం జగన్ తనను కుటుంబ సభ్యుడిలాగా ఆత్మీయంగా చూసుకున్నారని ఇటీవల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చెప్పడం గమనార్హం. రాష్ట్ర ప్రజల కోసం ముఖ్యమంత్రి జగన్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటం సంతోషదాయకమని గవర్నర్ ప్రశంసించారు. సమాజంలో ఏ వర్గాన్ని విస్మరించకుండా సంక్షేమ పథకాలను అందిస్తుండటం నిజంగా అభినందించదగ్గ విషయం అన్నారు. ఈ పథకాలపై తాము చాలాసార్లు చర్చించుకున్నామని, ఇన్ని సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేసేందుకు అన్ని నిధులు ఎలా సమకూరుస్తున్నారని ముఖ్యమంత్రి జగన్‌ ను తాను పలుమార్లు అడిగానని గుర్తు చేసుకున్నారు గవర్నర్. అయితే అదంతా దేవుడి ఆశీర్వాదమని సీఎం జగన్ వినమ్రంగా బదులిచ్చారని చెప్పారు. చిత్తశుద్ధితో పథకాలను ఆయన విజయవంతంగా అమలు చేస్తున్నారని గవర్నర్‌ ప్రశంసించారు.

మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం తరపున గవర్నర్ కు విజయవాడలో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌.. గవర్నర్‌ను ఘనంగా సత్కరించి జ్ఞాపిక బహూకరించారు. ఈరోజు గవర్నర్, గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి వెళ్లే క్రమంలో సీఎం జగన్ స్వయంగా వచ్చి పాదాభివందనం చేయడం విశేషం.

Tags:    
Advertisement

Similar News