మీతో అనుబంధం పార్టీలకు అతీతం, మాకు మరో ఎజెండా లేదు - మోడీతో జగన్‌

ఎనిమిదేళ్ల క్రితం రాష్ట్రానికి తగిలిన గాయం నుంచి కోలుకోవడానికి పెద్దలు నరేంద్ర మోడీ చేసే ప్రతి సాయాన్ని గుర్తించుకుంటామని సీఎం జ‌గ‌న్ అన్నారు.

Advertisement
Update: 2022-11-12 06:35 GMT

విశాఖలో పలు కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పీఎం మోడీ సమక్షంలో జగన్‌మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వంలో, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీతో తమ సంబంధాలు పార్టీలకు, రాజకీయాలకు అతీతమైనవని జగన్ చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి తప్ప తమకు మరో ఎజెండా లేదని... భవిష్యత్తులో ఉండబోదు అని కూడా జగన్ అన్నారు. ఎనిమిదేళ్ల క్రితం రాష్ట్రానికి తగిలిన గాయం నుంచి కోలుకోవడానికి పెద్దలు నరేంద్ర మోడీ చేసే ప్రతి సాయాన్ని గుర్తించుకుంటామన్నారు.

ఇకపైనా పెద్ద మనసు చేసుకుని రాష్ట్రానికి అదనంగా నిధులు, ప్రాజెక్టులు ఇవ్వాలని సీఎం కోరారు. ప్రజల కోసం మోడీ చేసే ఏ మంచైనా ఈ రాష్ట్రం గుర్తించుకుంటుందని సీఎం చెప్పారు. రాష్ట్ర అభివృద్ది కోసం విభజన హామీలు, పోలవరం, ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్‌, రైల్వే జోన్ వంటి అంశాలను సానుకూలంగా పరిగణలోకి తీసుకోవాలని సీఎం జగన్‌ కోరారు.

రాష్ట్రానికి ఇదే తరహాలో మీ ఆశీస్సులు కావాలి అంటూ మోడీకి చేతులు జోడించి నమస్కారం చేశారు సీఎం జగన్.

Tags:    
Advertisement

Similar News