బాబు దోచుకున్నారు.. ప్రజల కలను జగన్ సాకారం చేశారు

శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 854 అడుగులకు చేరుకున్న తర్వాత వెలిగొండ జంట సొరంగాల ద్వారా నీటిని తీసుకోవచ్చు. అంటే వరదల సమయంలో ఈ ప్రాజెక్ట్ ద్వారా మూడు జిల్లాలకు మేలు జరుగుతుంది.

Advertisement
Update: 2024-03-06 02:56 GMT

ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజల కలను నేడు సాకారం చేయబోతున్నారు సీఎం జగన్. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు టన్నెళ్లను ఈరోజు జాతికి అంకితం చేస్తారు. ప్రజాసంకల్ప యాత్రలో ఆ మూడు జిల్లాల ప్రజలకు మాట ఇచ్చిన జగన్.. దాన్ని నిలబెట్టుకున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భా­గమైన నల్లమలసాగర్‌కు కృష్ణా జలాలను తరలించేందుకు వీలుగా ఇక్కడ టన్నెళ్లను నిర్మించారు. మొదటి టన్నెల్‌ను 2021, జనవరి 13 నాటికి పూర్తిచేయించగా, రెండో టన్నెల్‌ తవ్వకం పనులు ఈ ఏడాది జనవరిలో పూర్తయ్యాయి. ఈ రెండు టన్నెళ్లను నేడు జాతికి అంకితం చేయబోతున్నారు సీఎం జగన్. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం ఎగువ చెర్లోపల్లి వద్ద పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.

చంద్రబాబు దోపిడీ..

వెలిగొండ ప్రాజెక్ట్ పనులు 2019 వరకు నత్తనడకన సాగాయి. వెలిగొండ పేరుతో నిధులు స్వాహా చేశారు కానీ, పనులు మాత్రం ముందుకు సాగలేదు. కాగ్ కూడా ఈ విషయంలో చంద్రబాబు చేసిన నిర్వాకాలను కడిగేసింది. ఆ తర్వాత జగన్ హయాంలో వెలిగొండ కల సాకారమైంది. రెండు టన్నెళ్ల నిర్మాణం ఆయన హయాంలో పూర్తి కావడమే దీనికి నిదర్శనం.

శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 854 అడుగులకు చేరుకున్న తర్వాత వెలిగొండ జంట సొరంగాల ద్వారా నీటిని తీసుకోవచ్చు. అంటే వరదల సమయంలో ఈ ప్రాజెక్ట్ ద్వారా మూడు జిల్లాలకు మేలు జరుగుతుంది. వరదనీటిని సద్వినియోగం చేసుకున్నట్టవుతుంది. వెలిగొండ జంట సొరంగాల ద్వారా నల్లమలసాగర్‌కు ఆ నీటిని తరలిస్తారు. తీగలేరు, గొట్టిపడియ, తూర్పు, పశ్చిమ కాలువల ద్వారా ఆయకట్టుకు నీళ్లందుతాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో 30 మండలాల్లోని 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 15.25 లక్షల మందికి తాగునీరు అందుతుంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని 4 నియోజకవర్గాల్లో ఫ్లోరైడ్ సమస్యకు కూడా ఈ ప్రాజెక్ట్ ద్వారా శాశ్వత పరిష్కారం లభించినట్టవుతుంది. 

Tags:    
Advertisement

Similar News