అల్ డిక్సన్ యూనిట్ ప్రారంభించిన సీఎం జగన్

రూ.200కోట్లతో ఏర్పాటు చేసిన ఈ మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ లో 2వేలమందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించాయి. యూనిట్ ప్రారంభం అనంతరం అక్కడి సిబ్బందితో సీఎం జగన్ ప్రత్యేకంగా మాట్లాడారు.

Advertisement
Update: 2023-07-10 12:28 GMT

కడప జిల్లా కొప్పర్తిలోని వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ లో అల్ డిక్సన్ యూనిట్ ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ యూనిట్ లో సీసీ కెమెరాలు, కెమెరాలు, ల్యాప్ టాప్ లు, ట్యాబ్ లు తయారు చేస్తారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద సీసీ కెమెరాల తయారీ యూనిట్ గా ఇక్కడ డిక్సన్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. రూ.200కోట్లతో ఏర్పాటు చేసిన ఈ మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ లో 2వేలమందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించాయి. యూనిట్ ప్రారంభం అనంతరం అక్కడి సిబ్బందితో సీఎం జగన్ ప్రత్యేకంగా మాట్లాడారు.


కడప నగరంలో రూ.871.77కోట్ల అభివృద్ధి పనులకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. రూ.1.37 కోట్లతో పూర్తయిన రాజీవ్‌ పార్కుని, రూ. 5.61కోట్లతో పూర్తయిన రాజీవ్‌ మార్గ్‌ ని ఆయన ప్రారంభించి కడప ప్రజలకు అంకితమిచ్చారు. రూ.31.17కోట్లతో నిర్మించబోతున్న కడప నగరపాలక సంస్థ నూతన కార్యాలయ భవనానికి జగన్ శంకుస్థాపన చేశారు. కడప నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆయన కొప్పర్తిలో డిక్సన్ యూనిట్ ప్రారంభించారు. ఆ తర్వాత తాడేపల్లికి తిరుగు ప్రయాణం అయ్యారు.

ముగిసిన పర్యటన..

అనంతపురం, కడప జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన ఈరోజుతో ముగిసింది. ఈనెల 8న అనంతపురంలో రైతు దినోత్సవంలో పాల్గొన్న ఆయన, అదే రోజు ఇడుపుల పాయలో వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 9వతేదీన పులివెందులలో స్పోర్ట్స్ అకాడమీ ప్రారంభించారు జగన్, గండికోట దగ్గర ఒబెరాయ్ హోటల్స్ కి భూమిపూజ చేశారు. ఈరోజు.. కడప, కొప్పర్తి కార్యక్రమాలతో మూడు రోజుల పర్యటన ముగించుకుని తిరిగి తాడేపల్లి బయలుదేరారు సీఎం జగన్. 

Tags:    
Advertisement

Similar News