పులివెందులలో అభివృద్ధి కార్యక్రమాలకు జగన్ శ్రీకారం

పులివెందుల చేరుకున్న ఆయన.. శ్రీ కృష్ణుడి ఆలయాన్ని ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన శిల్పారామంను కూడా సీఎం ప్రారంభించారు. అనంతరం స్వామి నారాయణ్ గురుకుల పాఠశాలకు శంకుస్థాపన చేశారు.

Advertisement
Update: 2023-11-09 15:15 GMT

సీఎం జగన్ ఈరోజు అన్నమయ్య, కడప జిల్లాల్లో పర్యటించారు. అన్నమయ్య జిల్లాలో శుభకార్యాలకు హాజరైన ఆయన, కడప జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అన్నమయ్య జిల్లాలో శాసన మండలి డిప్యూటీ చైర్ పర్సన్ జకియా ఖానం కుమారుడి వివాహ వేడుకకు జగన్ హాజరయ్యారు. రాయచోటిలో మాజీ ఎంపీపీ గౌస్‌ మహ్మద్‌ రఫీ కుటుంబ సభ్యుల వివాహ వేడుకలో జగన్ పాల్గొన్నారు.

అనంతరం పులివెందుల చేరుకున్న ఆయన.. శ్రీ కృష్ణుడి ఆలయాన్ని ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన శిల్పారామంను కూడా సీఎం ప్రారంభించారు. అనంతరం స్వామి నారాయణ్ గురుకుల పాఠశాలకు శంకుస్థాపన చేశారు. అంతర్జాతీయ పాఠశాల ఏర్పాటుకు 12 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించగా.. రూ.60 కోట్ల వ్యయంతో ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణాన్ని స్వామి నారాయణ్ సంస్థ చేపట్టింది. ఆ తర్వాత సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్‌ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌ డ్‌ రీసెర్చ్‌ ఆన్‌ లైవ్‌ స్టాక్‌ (ఏపీ కార్ల్‌)కు చేరుకున్నారు. అక్కడ స్టేట్ ఆఫ్ ఆర్ట్ సెంట్రల్ ల్యాబొరేటరీని ప్రారంభించారు.

ఆ తర్వాత పులివెందులలోని ఆదిత్యా బిర్లా యూనిట్ కు చేరుకున్న సీఎం జగన్‌ అక్కడి పనులను పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రాత్రికి ఇడుపులపాయకు బయలుదేరి వెళ్లారు. ఇడుపులపాయలో బసచేసి మరుసటి రోజు ఇడుపులపాయలోని ఆర్‌కే వ్యాలీ పోలీస్‌ స్టేషన్‌ ను సీఎం జగన్‌ ప్రారంభిస్తారు. 

Tags:    
Advertisement

Similar News