నేడు ఢిల్లీకి జగన్.. ఈసారి మీటింగ్ లు మరింత స్పెషల్

అధికారిక పర్యటనే అయినా ఏపీ రాజకీయాల్లో మాత్రం జగన్ ఢిల్లీ టూర్ పై తీవ్ర చర్చ జరుగుతోంది. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఢిల్లీలో అసలు ఏం జరుగుతుందోననే ఉత్కంఠ మొదలైంది.

Advertisement
Update: 2023-10-05 05:29 GMT

సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఈరోజు, రేపు ఆయన ఢిల్లీలో పర్యటిస్తారు. పలువురు కేంద్ర మంత్రుల్ని కలుస్తారు. అధికారిక పర్యటనే అయినా ఏపీ రాజకీయాల్లో మాత్రం జగన్ ఢిల్లీ టూర్ పై తీవ్ర చర్చ జరుగుతోంది. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఢిల్లీలో అసలు ఏం జరుగుతుందోననే ఉత్కంఠ మొదలైంది.

ఈరోజు సాయంత్రం ఢిల్లీ చేరుకున్న అనంతరం 6:30గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తో సీఎం జగన్ భేటీ అవుతారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలపై కేంద్రమంత్రితో ఆయన చర్చిస్తారు. రేపు (శుక్రవారం) ఉదయం విజ్ఞాన్‌ భవన్‌ లో వామపక్ష తీవ్రవాదం నిర్మూలనపై జరుగుతున్న సదస్సులో జగన్ పాల్గొంటారు. రేపు రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జగన్‌ సమావేశానికి అపాయింట్ మెంట్ లభించింది. చంద్రబాబు అరెస్ట్ కి పరోక్షంగా బీజేపీ కూడా కారణం అంటూ ఓ వర్గం ప్రచారం చేస్తోంది. ఈ దశలో ఏపీ సీఎం జగన్, బీజేపీ నేతల్ని కలవబోతున్నారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం కూడా చర్చకు వస్తుందనే ఊహాగానాలు వినపడుతున్నాయి.

ఏపీకి లోకేష్..

సీఎం జగన్ ఢిల్లీ వెళ్తున్న సందర్భంలో.. నారా లోకేష్ ఢిల్లీ నుంచి ఏపీకి వస్తున్నట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఢిల్లీలో మకాం వేసిన లోకేష్ కి అక్కడ కేంద్రంలోని పెద్దల అపాయింట్ మెంట్ లు లభించలేదు. అతి కష్టమ్మీద రాష్ట్రపతిని కలసి వినతిపత్రం ఇచ్చి వచ్చారు లోకేష్ అండ్ టీమ్. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ నోటీసులివ్వడంతో విచారణకోసం లోకేష్ ఏపీకి వస్తున్నారు. జగన్ ఇటునుంచి అటు వెళ్తుంటే, లోకేష్ అక్కడినుంచి ఇక్కడకు వస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News