జగన్ నిర్ణయం కూటమి ఊహలకు అందలేదు

వైనాట్ 175 అని కేవలం స్లోగన్ ఇచ్చి సరిపెట్టుకోలేదు సీఎం జగన్. గత ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతగా ఏ స్థాయిలో కష్టపడ్డారో, అంతకు మించి ఈసారి కష్టపడుతున్నారు.

Advertisement
Update: 2024-04-26 05:39 GMT

రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో సిద్ధం సభల్లో పాల్గొన్నారు, ఆ తర్వాత మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర పూర్తి చేశారు. ఇంకా సీఎం జగన్ ప్రచారం కొనసాగిస్తారని, రాష్ట్రవ్యాప్తంగా మరో టూర్ ప్లాన్ చేస్తారని ఎవరూ అనుకోలేదు. పులివెందుల నామినేషన్ సమయంలో కూడా పార్టీ వర్గాలకు టూర్ గురించి తెలియదు. కానీ సాయంత్రానికల్లా టూర్ షెడ్యూల్ విడుదలయ్యే సరికి అందరూ షాకయ్యారు. టీడీపీ బ్యాచ్ కి దిమ్మతిరిగింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వైసీపీ సభలు నిర్వహిస్తే, వాటికి జగన్ వస్తే ఇంకేమైనా ఉందా. ఇప్పటికే టీడీపీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంకా జగన్ జనాల్లోనే ఉంటే వారికి మరింత కష్టం. టీడీపీ ఊహలకు అందని జగన్ టూర్ తో.. ఎల్లో బ్యాచ్ లో టెన్షన్ మొదలైంది.

యువగళం, ప్రజాగళం, వారాహి..

సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి ప్రచారం తుస్సుమంది. ముందుగా నారా లోకేష్ యువగళం అట్టర్ ఫ్లాప్ అయింది. మరోవైపు పవన్ వారాహి అంటూ రోడ్లపైకి వచ్చి హడావిడి చేసినా ఫలితం లేదు. చివరిగా చంద్రబాబు ప్రజాగళం అంటూ జనంలోకి వస్తున్నా దానికి దశ, దిశ లేకపోవడంతో అట్టర్ ఫ్లాప్ గా మారింది. ఇక బీజేపీ నేతలు ప్రచారంలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్నారు. కూటమిలో సమన్వయం లేక, విడివిడిగా కూడా ఎవరూ ప్రభావం చూపలేక చతికిలపడ్డారు నేతలు. అటు సిద్ధం పేరు మారుమోగిపోతోంది. సభలు, బస్సుయాత్ర, ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాల యాత్రలతో వైసీపీ శ్రేణుల్లో రోజురోజుకీ జోరు పెరిగిపోతోంది.

వైనాట్ 175 అని కేవలం స్లోగన్ ఇచ్చి సరిపెట్టుకోలేదు సీఎం జగన్. గత ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతగా ఏ స్థాయిలో కష్టపడ్డారో, అంతకు మించి ఈసారి కష్టపడుతున్నారు. సంక్షేమ పథకాలపై పూర్తి స్థాయిలో నమ్మకం ఉన్నా కూడా, కూటమి మాయలో ప్రజలు పడిపోకుండా జాగ్రత్తపడుతున్నారు. తనపై దాడి జరిగినా వెనక్కి తగ్గకుండా ప్రజల్లోకి వస్తున్నారు. కూటమి కుట్రలను తానే ప్రజలకు వివరించి చెబుతున్నారు. మేమంతా సిద్ధం సభలతో వైసీపీ అభ్యర్థుల పరిచయాలు పూర్తయ్యాయి. ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలను ప్రత్యేకంగా ఎంపిక చేసుకుని మరీ ఆయన సభలకు వస్తున్నారు. గతంలో కవర్ చేయని నియోజకవర్గాలు, టఫ్ ఫైట్ ఉందని అనుకుంటున్న నియోజకవర్గాలపై జగన్ మరింత ఫోకస్ పెడుతున్నారు. దీంతో టీడీపీ వర్గాల్లో భయం మొదలైంది. 

Tags:    
Advertisement

Similar News