సడన్ గా ఆస్పత్రికి చంద్రబాబు.. ఏమైందంటే..?

జూబ్లీ హిల్స్‌ లోని తన నివాసం నుంచి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి ఈరోజు ఉదయం వెళ్లారు చంద్రబాబు. ఆస్పత్రికి కారులో వెళ్తుండగా దారిలో టీడీపీ నేతలు ఆయనను చూసేందుకు కారుని ఆపారు. దీంతో చంద్రబాబు కాన్వాయ్ ఆపి వారిని పలకరించారు.

Advertisement
Update: 2023-11-06 10:22 GMT

సడన్ గా ఆస్పత్రికి చంద్రబాబు.. ఏమైందంటే..?

బెయిల్ పై బయటకొచ్చిన చంద్రబాబు, వైద్యుల కంటే ఎక్కువగా రాజకీయ నాయకులనే కలుస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన ఓసారి మాత్రమే ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. ఆ తర్వాత ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. మొత్తంగా జైలు నుంచి విడుదలైన తర్వాత 24గంటల కంటే తక్కువే ఆయన ఆస్పత్రిలో ఇన్ పేషెంట్ గా ఉన్నారు. అయితే ఈ రోజు మళ్లీ ఆయన్ను ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.

జైలులో ఉన్నప్పుడు చంద్రబాబుకి అక్కడ బాలేదు, ఇక్కడ బాలేదు అంటూ హడావిడి చేసిన కుటుంబ సభ్యులు కూడా ఆయన బయటకొచ్చిన తర్వాత మాత్రం వైద్యం వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. కనీసం ఆయన ఆరోగ్యం ఎలా ఉందనే విషయాన్ని కూడా బయటకు చెప్పడంలేదు. ఇక వైద్యం విషయానికొస్తే.. హైదరాబాద్ వెళ్లిన తొలిరోజు ఆయనకు ఏఐజీ వైద్యులు ఇంటికి వచ్చి పరీక్షలు చేసి వెళ్లారు, తర్వాతి రోజు ఆయన ఆస్పత్రికి వెళ్లగా ఒకరోజు అబ్జర్వేషన్లో ఉంచారు. ఆ తర్వాత కంటి వైద్యం కోసం ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి వెళ్లారు. ఒకరోజంతా పవన్ కల్యాణ్ పరామర్శతో సరిపోయింది. మళ్లీ ఈరోజు ఆయన్ను ఏఐజీ ఆస్పత్రికి తరలించడంతో ఆయన ఆరోగ్యం వ్యవహారం చర్చకు వచ్చింది.

జూబ్లీ హిల్స్‌ లోని తన నివాసం నుంచి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి ఈరోజు ఉదయం వెళ్లారు చంద్రబాబు. ఆస్పత్రికి కారులో వెళ్తుండగా దారిలో టీడీపీ నేతలు ఆయనను చూసేందుకు కారుని ఆపారు. దీంతో చంద్రబాబు కాన్వాయ్ ఆపి వారిని పలకరించారు. ఆ తర్వాత ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడి వైద్యుల బృందం పలు వైద్య పరీక్షలతోపాటు చర్మ సంబంధ చికిత్స అందించినట్టు తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ చేయాలని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. మంగళవారం ఎల్వీప్రసాద్ ఆస్పత్రిలో చంద్రబాబు కంటికి ఆపరేషన్ చేస్తారు. 


Tags:    
Advertisement

Similar News