జనసేనపైన మైండ్‌ గేమ్

ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం కదా అందుకనే ఎల్లోమీడియా తో పాటు సోషల్ మీడియాలో కూడా లీకులను వదులుతున్నారు. టీడీపీ నుండి వచ్చే లీకులతో జనసేన నేతల్లో టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది.

Advertisement
Update: 2024-01-18 05:56 GMT

మిత్రపక్షం జనసేనపైన కూడా చంద్రబాబు మైండ్ గేమ్ ఆడుతున్నట్లే ఉన్నారు. లేకపోతే జనసేనకు అన్ని సీట్లు, ఇన్ని సీట్లనే లెక్కలు ఎలా వైరల్ అవుతున్నాయి. తాజాగా జనసేనకు 15 ఎమ్మెల్యేలు, రెండు ఎంపీ సీట్లను చంద్రబాబు కేటాయించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం పెరిగిపోతోంది. జనసేన నేత నాదెండ్ల మనోహర్ కు తెనాలిలో టికెట్ ఫైనల్ కాలేదని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు ఆఫర్ చేసిన 15 అసెంబ్లీ, 2 పార్లమెంటు సీట్లకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఓకే చెప్పినట్లు వార్త బాగా సర్క్యులేట్ అవుతోంది.

చంద్రబాబు లెక్కలో జనసేనకు ఇవ్వబోయే సీట్లంటు ఇప్పటికే చాలా అంకెలే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఉత్తఅంకెలతో కాదు నియోజకవర్గాలతో సహా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంటే ఇవన్నీ టీడీపీ నుండి సోషల్ మీడియాకు అందుతున్న లీకులే అని అర్థ‌మవుతోంది. ముందు లీకులు వదిలి అవతల వాళ్ళ రియాక్షన్ అంచనా వేయటం చంద్రబాబుకు మొదటినుండి ఉన్న అలవాటే. తన ఆలోచనలను ఒకప్పుడు ఎల్లోమీడియాకు లీకులిచ్చేవారు. రియాక్షన్ చూసి అవసరమైన మార్పులు చేసుకునే వారు.

ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం కదా అందుకనే ఎల్లోమీడియా తో పాటు సోషల్ మీడియాలో కూడా లీకులను వదులుతున్నారు. టీడీపీ నుండి వచ్చే లీకులతో జనసేన నేతల్లో టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. చంద్రబాబుకు కావాల్సింది కూడా సరిగ్గా ఇదే. నిజానికి ఇలాంటి వ్యూహాలకు కాలం చెల్లిపోయాయి. అయినా చంద్రబాబు అప్ డేట్ కాని కారణంగా పార్టీ ఇలాంటి లీకుల విధానాన్నే అనుసరిస్తోంది.

జనసేనకు ఇచ్చే సీట్ల సంఖ్యతో పాటు నియోజకవర్గాల జాబితాను అధికారికంగా ప్రకటించటం ఎంత ఆలస్యమైతే రెండు పార్టీలకు అంత నష్టమన్న విషయాన్ని చంద్రబాబు గ్రహించటంలేదు. జనసేనకు టికెట్లిస్తే తమ్ముళ్ళు ఎలా రియాక్టవుతారో, ఇవ్వకపోతే జనసేన ఎలా రియాక్టవుతుందో అన్న భయంతోనే కాలం గడిపేస్తున్నారు. చివరకు ఈ భయమే టీడీపీ+జనసేన పుట్టి ముంచుతుందేమో అని తమ్ముళ్ళలో చర్చలు జరుగుతున్నాయి. చివరకు ఏమవుతుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News