స్కిల్ కేసులో చంద్రబాబుకి బెయిల్..

మధ్యంతర బెయిల్ కండిషన్లను ఈ నెల 28 వరకే వాటిని పాటించాల్సి ఉంటుందని, 29వ తేదీ నుంచి రాజకీయ ర్యాలీలు, సభల్లో చంద్రబాబు పాల్గొనవచ్చని న్యాయమూర్తి తెలిపారు. అయితే హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలున్నాట్టుగా ప్రచారం జరుగుతోంది.

Advertisement
Update: 2023-11-20 09:53 GMT

టీడీపీ అధినేత చంద్రబాబుకి పెద్ద ఊరట నిచ్చింది ఏపీ హైకోర్టు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన మధ్యంతర బెయిల్ పై బయటే ఉన్నారు. ఈనెల 28తో ఆ బెయిల్ గడువు పూర్తవుతుంది. అయితే ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ రావడంతో తిరిగి ఆయన జైలుకి వెళ్లాల్సిన అవసరం లేదని తేలిపోయింది. ఈ నెల 28న రాజమండ్రి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని.. అయితే ఈ నెల 30 ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారు.

స్కిల్ కేసులో సెప్టెంబర్ 9న అరెస్ట్ అయిన చంద్రబాబు 52రోజులు రాజమండ్రి జైలులో ఉన్నారు. అనారోగ్య కారణాలతో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు కాగా అక్టోబర్ 31న జైలు నుంచి బయటకు వచ్చారు. కుడి కంటికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. గుండె, చర్మ సమస్యలకు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మరోవైపు ఆయన రెగ్యులర్ బెయిల్ పై కూడా కోర్టుల్లో వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఈనెల 17న బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగియడంతో తీర్పును ఉన్నత న్యాయస్థానం రిజర్వు చేసింది. ఈరోజు చంద్రబాబుకి బెయిలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

షరతులు వర్తిస్తాయా..?

రాజకీయ సమావేశాల్లో పాల్గొనకూడదని, ప్రసంగాలివ్వకూడదని మధ్యంతర బెయిల్ సమయంలో కోర్టు చంద్రబాబుకి కొన్ని కండిషన్లు పెట్టింది. అయితే ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ రావడంతో ఆ నియమాలు వర్తించవని అంటున్నారు. మధ్యంతర బెయిల్ కండిషన్లను ఈ నెల 28 వరకే వాటిని పాటించాల్సి ఉంటుందని, 29వ తేదీ నుంచి రాజకీయ ర్యాలీలు, సభల్లో చంద్రబాబు పాల్గొనవచ్చని న్యాయమూర్తి తెలిపారు. అయితే హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలున్నాట్టుగా ప్రచారం జరుగుతోంది.

Tags:    
Advertisement

Similar News