షర్మిలపై మోడీ వ్యాఖ్య‌ల‌కు చంద్ర‌బాబు, ప‌వ‌న్ షాక్‌

షర్మిలను అడ్డం పెట్టుకుని జగన్‌తో మైండ్‌ గేమ్‌ ఆడాలని చంద్రబాబు ప్రయత్నిస్తుంటే మోడీ మాత్రం షర్మిల, జగన్‌ వేర్వేరు కాదన్నారు. తద్వారా జగన్‌పై ఎక్కుపెట్టిన షర్మిల బాణాన్ని మోడీ చంద్రబాబు నుంచి లాగి పడేశారు.

Advertisement
Update: 2024-03-18 10:07 GMT

ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కంగు తిన్నారు. జగన్‌కు ఓటు వేయవద్దని ఆయన చెల్లెలు కూడా కోరారని చంద్రబాబు తన ప్రసంగంలో అన్నారు. వైసీపీ రక్తంతో తడిసిందని కూడా జగన్‌ చెల్లెళ్లే వ్యాఖ్యానిస్తున్నారని కూడా ఆయన అన్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగంలో షర్మిలపై చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు కంగు తిన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ పార్టీ, కాంగ్రెస్‌ వేర్వేరు కాదని, రెండు ఒకటేనని, రెండు పార్టీలను కూడా ఒకే కుటుంబానికి చెందినవాళ్లు నడుపుతున్నారని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎన్డీఏ కూటమికి పడకుండా ఇద్దరూ కుమ్మక్కు అయ్యారని, వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాంగ్రెస్‌కు మళ్లించాలని ప్రయత్నిస్తున్నారని ప్రధాని మోడీ అన్నారు. దాంతో చంద్రబాబుతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కూడా షాక్‌కు గురయ్యారు.

షర్మిలను అడ్డం పెట్టుకుని జగన్‌తో మైండ్‌ గేమ్‌ ఆడాలని చంద్రబాబు ప్రయత్నిస్తుంటే మోడీ మాత్రం షర్మిల, జగన్‌ వేర్వేరు కాదన్నారు. తద్వారా జగన్‌పై ఎక్కుపెట్టిన షర్మిల బాణాన్ని మోడీ చంద్రబాబు నుంచి లాగి పడేశారు.

మోడీ వ్యాఖ్యలతో షర్మిల కూడా కంగు తిన్నట్లే ఉన్నారు. జగన్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటేనే షర్మిల రాజకీయ ప్రయోజనం నెరవేరుతుంది. దాంతో షర్మిల వెంటనే మోడీ వ్యాఖ్యలపై స్పందించారు. జగనే మోడీ దత్తపుత్రుడని ఆమె అన్నారు. మోడీ తనను విమర్శించడం ఏమిటని ఆమె ప్రశ్నించారు.

Tags:    
Advertisement

Similar News