ఇద్దరి భయం ఒకటేనా?

ఇక్కడ ఇద్దరిని భయపెడుతున్న కామన్ పాయింట్ ఏమిటంటే గెలుపు. కుప్పంలో ఎలా గెలవాలో చంద్రబాబుకు అర్థంకావటంలేదు. అలాగే పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని ప్రకటిస్తే రూ.200 కోట్ల ఖర్చు పెట్టయినా తనను ఓడించటానికి జగన్ సిద్ధంగా ఉన్నట్లు పవన్ ప్రకటించారు.

Advertisement
Update: 2023-06-16 05:57 GMT

రాబయే ఎన్నికల్లో వైసీపీని ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకున్నారు. విడివిడిగా పోటీ చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డే అధికారంలోకి వస్తారని భయపడుతున్నారు. అందుకనే పొత్తులు పెట్టుకోవటం ఒకటే శరణ్యమని నిర్ణయానికి వచ్చారు. అయితే ఇద్దరిని ఒకేరకమైన భయం పట్టిపీడిస్తోంది. ఆ ఇద్దరు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. చంద్రబాబు, పవన్ తాజా వ్యాఖ్యలే వాళ్ళల్లో జగన్ అంటే ఎంత భయముందో చెప్పేస్తోంది.

ఇంతకీ విషయం ఏమిటంటే కుప్పం పర్యటనలో చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్ లాంటి ముఖ్యమంత్రిని గతంలో తాను ఎవరినీ చూడలేదన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే చంద్రబాబు చాలాసార్లు చెప్పారు. ఇక వారాహి యాత్రలో పవన్ మాట్లాడుతూ.. జగన్‌ను గద్దె దింపకపోతే కష్టమన్నారు. ఇక్కడ ఇద్దరిని భయపెడుతున్న కామన్ పాయింట్ ఏమిటంటే గెలుపు. కుప్పంలో ఎలా గెలవాలో చంద్రబాబుకు అర్థంకావటంలేదు. అలాగే పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని ప్రకటిస్తే రూ.200 కోట్ల ఖర్చు పెట్టయినా తనను ఓడించటానికి జగన్ సిద్ధంగా ఉన్నట్లు పవన్ ప్రకటించారు.

అంటే ఇద్దరూ కూడా తమ గెలుపుపై నమ్మకంతో లేరని తెలిసిపోతోంది. మొన్నటివరకు కుప్పంలో నామినేషన్ వేస్తే గెలిచేపోయే చంద్రబాబు రానున్న‌ ఎన్నికల్లో ఏమవుతుందో అనే టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీ కొట్టిన దెబ్బకు ప్రతి రెండు నెలలకు మూడు రోజులు కుప్పంలో పర్యటిస్తున్నారు. గెలుపోటములను పక్కనపెట్టేస్తే ఫలితాల్లో గెలిచినట్లు తేలేంతవరకు చంద్రబాబుకు టెన్షన్ తప్పదు.

ఇక పవన్ కూడా సేమ్ టు సేమ్. ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తారని భయపడుతున్నారు. అందుకనే తాను పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని ప్రకటించటం లేదు. ఓడించేందుకు ప్రయత్నం ఇప్పటి నుండి కాకపోతే నామినేషన్ సమయం నుండైనా మొదలుపెడతారు. అయినా నియోజకవర్గాన్ని ప్రకటించటానికి వెనకాడుతున్నారంటేనే పవన్ ఎంత భయపడుతున్నారో అర్థ‌మవుతోంది. పార్టీవర్గాల సమాచారం ప్రకారం భీమవరం నుండి పోటీ చేయటానికి ప్లాన్ చేస్తున్నారట. నరసాపురం నుండి ఎంపీగా రఘురామకృష్ణంరాజు, భీమవరం ఎమ్మెల్యేగా పవన్ పోటీ చేస్తే కాపు+క్షత్రియ కాంబినేషన్లో ఇద్దరూ గెలవచ్చని అనుకున్నట్లు సమాచారం. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

Tags:    
Advertisement

Similar News