పవన్‌కు వారి నుంచి అందని శుభాకాంక్షలు

కానీ ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రి అమిత్ షా నుంచి పవన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందలేదు. భాగస్వామిగా ఉన్నప్పటికీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పవన్‌ను పలకరించలేదు.

Advertisement
Update: 2022-09-03 12:34 GMT

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ పుట్టిన రోజు నాడు శుభాకాంక్షల వెల్లువ వచ్చింది. సినీ, పలువురు రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నాయకుడు నారా లోకేష్‌తో పాటు పలువురు టీడీపీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. అయితే వైసీపీ నుంచి ఏ ఒక్కరూ పవన్‌కు విషెస్‌ చెప్పలేదు.

బీజేపీ నుంచి కూడా కేవలం తెలుగు నాయకులు మాత్రమే పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ తమిళి సై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు జీవీఎల్‌, సీఎం రమేష్, ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, బండి సంజయ్ తదితరులు శుభాకాంక్షలు చెప్పారు. కానీ ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రి అమిత్ షా నుంచి పవన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందలేదు. భాగస్వామిగా ఉన్నప్పటికీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పవన్‌ను పలకరించలేదు.

బీజేపీ పెద్దల నుంచి శుభాకాంక్షలు అందుకునే స్థాయి కూడా పవన్‌ కల్యాణ్‌కు లేదా అన్న చర్చ నడుస్తోంది. పేరుకు మిత్రపక్షమనే గానీ.. తొలి నుంచి కూడా పవన్‌ కల్యాణ్‌ను బీజేపీ పెద్దలు గౌరవించింది లేదు. అల్లూరి విగ్రహావిష్కరణకు కూడా పిలవలేదు. ఇతర సినీహీరోలతో సమావేశం అవుతున్న బీజేపీ పెద్దలు పవన్‌ కల్యాణ్‌కు మాత్రం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదు.

Tags:    
Advertisement

Similar News