పిన్నెల్లికి బిగ్‌ రిలీఫ్‌.. జూన్‌ 5 వరకు డెడ్‌లైన్

నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తాడిపత్రి తెలుగుదేశం అభ్యర్థి జేసీ అస్మిత్‌రెడ్డిలు సైతం ముందస్తు బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేయడంతో పిన్నెల్లి పిటిషన్‌తో కలిపి విచారణ చేపట్టింది.

Advertisement
Update: 2024-05-23 18:40 GMT

ఈవీఎం ధ్వంసం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బిగ్ రిలీఫ్‌ లభించింది. పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. కీలక ఆదేశాలు జారీ చేసింది. పిన్నెల్లిపై జూన్ 5 ఉదయం 10 గంటల వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. పిన్నెల్లి కోసం మూడు రోజులుగా ఏపీ పోలీసులు గాలిస్తున్న విషయం తెలిసిందే.

ఇక అల్లర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తాడిపత్రి తెలుగుదేశం అభ్యర్థి జేసీ అస్మిత్‌రెడ్డిలు సైతం ముందస్తు బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేయడంతో పిన్నెల్లి పిటిషన్‌తో కలిపి విచారణ చేపట్టింది. ఈ ఇద్దరికీ కూడా ఇవే ఆదేశాలను వర్తిస్తాయని స్పష్టం చేసింది ఏపీ హైకోర్టు.


ఇక అభ్యర్థులపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎలక్షన్‌ కమిషన్‌కు సూచించింది హైకోర్టు. కేసులకు సంబంధించి సాక్షులను ప్రభావితం చేయకూడదని అభ్యర్థులకు కండీషన్ పెట్టింది. ఈ కేసులో తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. 

Tags:    
Advertisement

Similar News