Taraka Ratna Health Latest Update: అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం.. ఆస్పత్రి లేటెస్ట్ రిపోర్ట్

Taraka Ratna Health Latest Update: గుండె వైద్య నిపుణులతోపాటు, ఇతర వైద్యులు కూడా 24గంటలు ఆయన్ను పర్యవేక్షిస్తున్నట్టు నారాయణ హృదయాలయ యాజమాన్యం తెలిపింది. లైఫ్ సపోర్ట్ పరికరాలతో రక్త ప్రసరణ మెరుగు పరిచేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు వైద్యులు.

Advertisement
Update: 2023-01-28 09:51 GMT

Taraka Ratna Health Latest Update: అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం.. ఆస్పత్రి లేటెస్ట్ రిపోర్ట్

నందమూరి తారక రత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలిపారు నారాయణ హృదయాలయ వైద్యులు. ఆయన్ను కుప్పం నుంచి బెంగళూరుకు తరలించిన తర్వాత తొలిసారిగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై బులిటెన్ విడుదల చేశారు. కుప్పం నుంచి తీసుకొచ్చే సమయంలోనే ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని చెప్పారు. అదే కండిషన్లో ఆయన్ను తమ ఆస్పత్రిలో చేర్చుకున్నామని, చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

వైద్యబృందం నిరంతర పర్యవేక్షణ..

గుండె వైద్య నిపుణులతోపాటు, ఇతర వైద్యులు కూడా 24గంటలు ఆయన్ను పర్యవేక్షిస్తున్నట్టు నారాయణ హృదయాలయ యాజమాన్యం తెలిపింది. లైఫ్ సపోర్ట్ పరికరాలతో రక్త ప్రసరణ మెరుగు పరిచేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు వైద్యులు. ఆయనకోసం సందర్శకులెవర్నీ ఆస్పత్రి లోపలికి అనుమతించట్లేదన్నారు. మరికొన్ని రోజులపాటు ఆయనకు అత్యవసర చికిత్స అందాలని చెప్పారు.



యువగళం పాదయాత్ర సమయంలో సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్నను వెంటనే కేసీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయనకు సీపీఆర్ ఇచ్చారు. ఆ తర్వాత అక్కడినుంచి వెంటనే మెరుగైన వైద్యం కోసం కుప్పంలోని పీఈఎస్ వైద్యశాలకు తరలించారు. ఆ తర్వాత అర్థరాత్రి నేరుగా బెంగళూరుకి షిఫ్ట్ చేశారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి సరిగ్గా అర్థరాత్రి ఒంటిగంటకు అంబులెన్స్ లో చేరుకున్నారు తారకరత్న. అప్పటినుంచి ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఆయన కోలుకుంటున్నారని, ప్రమాదకర పరిస్థితులు లేవని కుప్పంలో ఉన్నప్పుడు డాక్టర్లు చెప్పారనే వార్తలొచ్చాయి. కానీ బెంగళూరు వైద్యులు మాత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటున్నారు. దీంతో నందమూరి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 

Tags:    
Advertisement

Similar News