ఏపీలో బ్యాండేజ్ పాలిటిక్స్.. వణికిపోతున్న పచ్చబ్యాచ్

చిన్న బ్యాండేజ్ చూస్తేనే పచ్చ బ్యాచ్ కి ఎందుకంత భయం..? ఆ బ్యాండేజ్ చుట్టూ ఎందుకీ నీఛ రాజకీయాలు.

Advertisement
Update: 2024-04-26 02:44 GMT

సీఎం జగన్ నుదిటిపై ఉన్న చిన్న బ్యాండేజ్ ఇప్పుడు పచ్చ బ్యాచ్ ని వణికిస్తోంది. ఆ బ్యాండేజ్ ఎందుకు..? దాని సైజ్ ఎందుకు పెరిగింది..? అది ఎప్పుడు తీసేస్తారంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు టీడీపీ నేతలు. చంద్రబాబు కూడా పదే పదే తన ప్రసంగాల్లో జగన్ బ్యాండేజ్ ని గుర్తు చేస్తున్నారు. చిన్న బ్యాండేజ్ చూస్తేనే పచ్చ బ్యాచ్ కి ఎందుకంత భయం..? ఆ బ్యాండేజ్ చుట్టూ ఎందుకీ నీఛ రాజకీయాలు.

గులకరాయి దాడిలో గాయపడిన జగన్ నుదుడిపై కుట్లు పడటంతో బ్యాండేజ్ వేసుకున్నారు. గాయం మానాలంటే దానికి చికిత్స అవసరమే కదా..? ఇక్కడ గాయం నిజం, కుట్లు పడింది నిజం, బ్యాండేజ్ నిజం.. ఎల్లో బ్యాచ్ రచ్చ అనేది లాజిక్ లేని విషయం. కానీ పదే పదే అదే విషయాన్ని హైలైట్ చేయడం చంద్రబాబుకి అలవాటు. అందుకే తన ప్రసంగాల్లో కచ్చితంగా ఆ పాయింట్ ఉండేట్టు చూసుకుంటున్నారు. పవన్ కల్యాణ్ కూడా ఆయనకు వంత పాడుతున్నారు.


డాక్టర్ సునీత..

వైఎస్ వివేకా హత్య కేసులో అభాండాలు వేసి కడపలో షర్మిలకు రాజకీయ లబ్ధి చేకూర్చాలని చూస్తున్న సునీత కూడా సడన్ గా జగన్ గాయంపై ఫోకస్ పెట్టారు. తాను ఓ డాక్టర్ గా జగన్ కి సలహా ఇస్తున్నానని, అన్ని రోజులు బ్యాండేజ్ ఉండకూడదని, గాయానికి గాలి తగలాలని అంటున్నారు. జగన్ కి ఏ డాక్టర్ వైద్యం చేస్తున్నారోనంటూ వెటకారం చేశారు.


ఎల్లో మీడియా ఊరుకుంటుందా.. కోడిగుడ్డుపై ఈకలు పీకడం మొదలు పెట్టింది. గాయం తగిలిన తొలిరోజు బ్యాండేజ్ సైజ్, రెండోరోజు పెరిగిన సైజ్, మూడోరోజు ఇంకా పెరిగిన సైజ్ అంటూ గ్రాఫిక్స్ కథనాలిస్తోంది. జగన్ చేసిన మంచి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలు చూసి ప్రజలు ఓట్లు వేస్తారు కానీ, ఆయన తలకున్న బ్యాండేజ్ ని చూడరు. ఆ మాటకొస్తే ఘాట్ రోడ్ యాక్సిడెంట్ ని ఓ రేంజ్ లో ప్రచారం చేసుకుని ముందస్తు ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబుకి ప్రజలు ఎలాంటి తీర్పుఇచ్చారో అందరికీ తెలుసు. అంతటి ప్రమాదమే చంద్రబాబుని కాపాడలేదు. మరి జగన్ తలపై ఉన్న అరంగుళం బ్యాండేజ్ చూసి బాబు భయపడటం ఎందుకు..?

Tags:    
Advertisement

Similar News