జగన్ అలుసు ఇస్తున్నారా..? బాలినేని ఛాన్స్ తీసుకుంటున్నారా..?

ప్రస్తుతం బాలినేని వైసీపీలోనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు కానీ, ఆయన కొడుకు ప్రణీత్ రెడ్డికి కానీ వైసీపీ టికెట్ నిరాకరిస్తే మాత్రం వేగంగా పరిణామాలు మారే అవకాశం ఉంది. పోనీ బాలినేనికి ఒంగోలు మినహా ఇంకెక్కడైనా పోటీ చేయాలని ఆఫర్ ఇచ్చినా కూడా ఆయన అంగీకరించే పరిస్థితి లేదు.

Advertisement
Update: 2023-12-10 03:54 GMT

ఇటీవల కాలంలో బాలినేని అలగడం, తాడేపల్లి పిలిపించుకుని సీఎం జగన్ బుజ్జగించడం.. రొటీన్ గా జరుగుతున్న కథే. ప్రకాశం జిల్లాలో భూముల కబ్జా, అక్రమ రిజిస్ట్రేషన్ల స్కామ్ బయటకొచ్చాక బాలినేని ఎపిసోడ్ మరింత రసవత్తరంగా మారింది. గన్ మెన్లను సరెండర్ చేయడం, జిల్లా ఎస్పీతో గొడవపడటం.. ఇలా రకరకాల మలుపులు ఈ ఎపిసోడ్ లో ఉన్నాయి. తాజాగా మరోసారి బాలినేని వార్తల్లో వ్యక్తిగా మారారు. ఆయన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి.

రాజకీయాలంటేనే నాకు వెగటు పుడుతోంది..

హాయిగా సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తా..

జగన్ పై మాకు అపారమైన ప్రేమ ఉంది.. మాపైన ఆయనకు ఉండొద్దా..

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని 50లక్షల రూపాయలు పందెం కాశా..

అయిదుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు మంత్రిగా పనిచేశా. నాకు పోయేదేమీలేదు..

నేనేమీ నీతిమంతుడ్ని అని చెప్పడంలేదు, మంత్రి గా ఉన్నప్పుడు ఖర్చులకోసం డబ్బులు తీసుకున్నా..

ఒంగోలులో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఇలా సాగింది బాలినేని మాటల ప్రవాహం. ఈ మాటలు విన్నవారెవరికైనా వచ్చే దఫా ఆయన వైసీపీ తరపున ఎన్నికల బరిలో దిగకపోవచ్చు అనే అభిప్రాయం ఏర్పడుతుంది. పోనీ ఆయనకు ఆశ ఉన్నా అధిష్టానం ఆయన్ను కచ్చితంగా పక్కనపెడుతుందనే అనుమానం వస్తుంది.

ఎక్కడ చెడింది..?

మంత్రిగా ఉన్న బాలినేని, మాజీగా మారిన తర్వాత పార్టీతో ఆయనకు గ్యాప్ పెరిగిందనేది వాస్తవం. ఆ తర్వాత రీజనల్ కోఆర్డినేటర్ గా బాధ్యతలు నిర్వర్తించడం, ఆ క్రమంలో సొంత నియోజకవర్గంలో గడప గడపకు హాజరు కాకపోవడంతో.. సమీక్షల్లో సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కోఆర్డినేటర్ పదవి వద్దని కేవలం ఎమ్మెల్యేగానే కొనసాగుతానని జగన్ కి స్పష్టం చేసి సైలెంట్ గా ఉన్నారు. మధ్య మధ్యలో ఇలాంటి హాట్ కామెంట్స్ చేస్తున్నారు.

బాలినేని భవిష్యత్ ఏంటి..?

ప్రస్తుతం బాలినేని వైసీపీలోనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు కానీ, ఆయన కొడుకు ప్రణీత్ రెడ్డికి కానీ వైసీపీ టికెట్ నిరాకరిస్తే మాత్రం వేగంగా పరిణామాలు మారే అవకాశం ఉంది. పోనీ బాలినేనికి ఒంగోలు మినహా ఇంకెక్కడైనా పోటీ చేయాలని ఆఫర్ ఇచ్చినా కూడా ఆయన అంగీకరించే పరిస్థితి లేదు. ప్రస్తుతం సొంత పార్టీ నేతలే బాలినేని వ్యాఖ్యలపై కౌంటర్లిస్తున్నారు. సీఎం జగన్ మాత్రం సమయం కోసం వేచి చూస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News