ఎల్లోమీడియా దుష్ప్రచారాన్ని ప్రభుత్వ ఉద్యోగులు ఖండించాలి

సీఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే లక్షా 30 వేల మంది సచివాలయ ఉద్యోగులను నియమించారని ఆయన చెప్పారు.

Advertisement
Update: 2024-03-03 06:21 GMT

రాష్ట్రంలో ప్రభుత్వం ఒకపక్క అభివృద్ధి చేస్తుంటే.. ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోందని.. దానిని ఖండించాలని.. ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌(ఏపీజీఈఎఫ్‌) చైర్మన్‌ కాకర్ల వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. అమలాపురంలో శనివారం ఆయన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించడానికి ఏపీజీఈఎఫ్‌ ఆధ్వర్యంలో ‘మన ప్రభుత్వం – మన ప్రగతి’ కార్యక్రమం ప్రారంభించామని ఆయన తెలిపారు. ఈ నెల 10న అమలాపురం నుంచి ఈ ర్యాలీ నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు. ఇందులో అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులూ పాల్గొని ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై ప్రచారం చేస్తారన్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే లక్షా 30 వేల మంది సచివాలయ ఉద్యోగులను నియమించారని ఆయన చెప్పారు. అయినప్పటికీ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు చేపట్టలేదంటూ ప్రభుత్వంపై కొన్ని పత్రికలు, ఛాన‌ళ్లు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిప‌డ్డారు. ఈ దుష్ప్రచారాన్ని ఉద్యోగులు తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేశారు.

Tags:    
Advertisement

Similar News