చిరంజీవి, పవన్‌కు పోసాని సినిమా..

తమ్ముడు పవన్ కల్యాణ్‌ కూడా అన్న బాటలోనే నడుస్తున్నాడు. అదో మెంటల్‌ కేసు. లోకేశ్‌ అవినీతి చేశాడని బట్టలు చించుకుని.. చంద్రబాబు ఉగ్రరూపం ప్రదర్శించగానే ఆయన కాళ్లపై పడ్డాడు.

Advertisement
Update: 2024-04-23 02:46 GMT

జనం కోసం జగన్‌ పార్టీ పెడితే.. పైసల కోసం మెగా ఫ్యామిలీ పార్టీ పెట్టిందని విమర్శించారు ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పోసాని కృష్ణ మురళీ. చిరంజీవి, పవన్ కల్యాణ్‌పై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. " గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెడితే కాపులు సంతోషించారు. కొందరు కాపు నాయకులు ఆస్తులు అమ్ముకుని పార్టీకోసం పనిచేశారు. 18 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌కు అమ్ముకున్నారు. చిరంజీవి కొట్టిన ఆ దెబ్బకు కాపులంతా ఆస్తులు పోగొట్టుకుని రోడ్డునపడ్డారు. కానీ చిరంజీవి మాత్రం రాజ్యసభ సీటు, కేంద్రమంత్రి పదవి తీసుకున్నారు".

" తమ్ముడు పవన్ కల్యాణ్‌ కూడా అన్న బాటలోనే నడుస్తున్నాడు. అదో మెంటల్‌ కేసు. లోకేశ్‌ అవినీతి చేశాడని బట్టలు చించుకుని.. చంద్రబాబు ఉగ్రరూపం ప్రదర్శించగానే ఆయన కాళ్లపై పడ్డాడు. చంద్రబాబును సీఎం చేసేందుకు సిద్ధమయ్యాడు. కాపుల్లో ఎవరూ ముఖ్యమంత్రిగా పనికిరారని పవన్‌ తేల్చేశాడు. తాను కూడా సీఎంగా పనికిరానని పవన్‌ చెప్పుకుంటున్నాడు. కాపుల ఓట్లు గంపగుత్తగా చంద్రబాబుకు వేయించాలనేదే పవన్ ప్రణాళిక "అంటూ పవన్‌పై విమర్శలు గుప్పించారు పోసానీ.

Tags:    
Advertisement

Similar News