బీజేపీ లిస్ట్ పై చంద్రబాబు ముద్ర.. రఘురామకు షాక్

చంద్రబాబు కోటాలో సీఎం రమేష్ కి అనకాపల్లి ఎంపీ సీటు ఖాయం చేసింది బీజేపీ అధిష్టానం. ఇక ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి రాజమండ్రి సీటు కేటాయించారు.

Advertisement
Update: 2024-03-24 18:05 GMT

బీజేపీ ఐదో జాబితాలో ఏపీ లోక్ సభ సీట్లు ఖరారయ్యాయి. పొత్తులో భాగంగా ఏపీలో 6 లోక్ సభ స్థానాలకు బీజేపీ పోటీ చేయాల్సి ఉంది. ఈ 6 సీట్లకు అభ్యర్థుల్ని ఒకే విడతలో ప్రకటించింది అధిష్టానం. అయితే ఇక్కడ బీజేపీ జాబితాపై చంద్రబాబు ముద్ర స్పష్టంగా కనపడుతోంది. పార్టీకోసం పనిచేసిన వారిని వదిలేసి వలస నేతలకు బీజేపీ పెద్దపీట వేయడం గమనార్హం.

బాబు కోటాలో..

చంద్రబాబు కోటాలో సీఎం రమేష్ కి అనకాపల్లి ఎంపీ సీటు ఖాయం చేసింది బీజేపీ అధిష్టానం. ఇక ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి రాజమండ్రి సీటు కేటాయించారు. నర్సాపురంలో మాత్రం రఘురామ కృష్ణంరాజుకి ఛాన్స్ ఇవ్వలేదు. అక్కడ శ్రీనివాస్ వర్మకు టికెట్ ఖరారైంది. అరకులో కొత్తపల్లి గీత, తిరుపతిలో వరప్రసాద్.. ఇలా ఇద్దరు వలస నేతలకు ఛాన్స్ దొరికింది. ఇక రాజంపేటనుంచి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బరిలో నిలుస్తుండటం మరో విశేషం.

జీవీఎల్ నరసింహారావుకి సీటు లేకపోవడం సంచలనంగా మారింది. సోము వీర్రాజు కూడా లోక్ సభ స్థానం కోసం పోరాటం చేశారు కానీ, ఆయనకు అసెంబ్లీ సీటు దక్కే అవకాశాలున్నాయి. మొత్తమ్మీద బీజేపీ కోసం సిన్సియర్ గా పనిచేసినవారిని కాదని వలస నేతలకు ఆ పార్టీ పెద్దపీట వేయడం గమనార్హం. తెలంగాణలో కూడా ఇలాంటి వ్యూహాన్నే అమలు చేసిన బీజేపీ, ఏపీలో కూడా వలస నేతలకు ప్రాధాన్యత ఇచ్చింది. మధ్యాహ్నం పార్టీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ కి సాయంత్రం లిస్ట్ లో చోటు దక్కడం విశేషం. 

Tags:    
Advertisement

Similar News