చంద్రబాబుకి ఊరట.. వినడానికి బాగానే ఉంది కానీ..!

బెయిల్ పిటిషన్లు వేస్తున్నారు, డిస్మిస్ అవుతున్నాయి. క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టుకి చేరింది కానీ అసలు విషయం తేలట్లేదు. ఈ దశలో చంద్రబాబుకి రెండు కేసుల్లో హైకోర్టులో అతి స్వల్ప ఊరట లభించింది.

Advertisement
Update: 2023-10-11 10:07 GMT

చంద్రబాబుకి ఊరట..

ఈ మాట టీడీపీ నేతలు, కార్యకర్తలకు వినడానికి బాగానే ఉంటుంది కానీ.. ఈ ఊరట ఏ స్థాయిలో ఉందో తెలిస్తే మాత్రం పెదవి విరిచే పరిస్థితి. నెలరోజులకు పైగా చంద్రబాబుకి కోర్టుల్లో పూర్తిగా వ్యతిరేక తీర్పులే వస్తున్నాయి. బెయిల్ పిటిషన్లు వేస్తున్నారు, డిస్మిస్ అవుతున్నాయి. క్వాష్ పిటిషన్ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి సుప్రీంకోర్టుకి చేరింది కానీ అసలు విషయం తేలట్లేదు. ఈ దశలో చంద్రబాబుకి రెండు కేసుల్లో హైకోర్టులో అతి స్వల్ప ఊరట లభించింది.

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అక్రమాలు, అంగళ్లు అల్లర్ల కేసుల్లో చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. అంగళ్లు కేసులో 12వ తేదీ (గురువారం) వరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులోనూ 16వ తేదీ (సోమవారం) వరకు ఆయన్ను అరెస్టు చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు రెండు కేసుల్లోనూ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఫలితమేంటి..?

ఈ రెండు కేసుల్లో చంద్రబాబుని అరెస్ట్ చేయొద్దని హైకోర్టు చెప్పినా దానికి కాలపరిమితి బహు స్వల్పం. ఒక కేసులో ఒకరోజు, ఇంకో కేసులో మరో నాలుగు రోజులు.. ఆ మాత్రం దానికి దాన్ని ఊరట అనలేం. ఎందుకంటే చంద్రబాబు ఇప్పుడు బయట లేరు. జైలులోనే ఉన్నారు. ఆ కేసుల్లో అరెస్ట్ చేయొద్దు అన్నంత మాత్రాన ఆయనకు ఒరిగేదేం లేదు. కాకపోతే ముందస్తు బెయిల్ వద్దని సీఐడీ వాదించినా.. అరెస్ట్ వద్దని కోర్టు చెప్పడం విశేషం. 


Tags:    
Advertisement

Similar News