రీపోలింగ్ అవసరం లేదన్న హైకోర్టు

ఎన్నికల తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించిన ఏపీ సీఈఓ ముకేష్ కుమార్ మీనా ఎక్కడా రీపోలింగ్ జరపాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇప్పుడు హైకోర్టు కూడా రీపోలింగ్ కి అవకాశం లేకుండా ఆయా పిటిషన్లను డిస్మిస్ చేసింది.

Advertisement
Update: 2024-05-23 16:29 GMT

ఏపీలో సత్తెనపల్లి, చంద్రగిరి నియోజకవర్గాల్లో రీపోలింగ్ జరిపించాలంటూ దాఖలైన పిటిషన్లను ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ రెండు పిటిషన్లపై ఈరోజు విచారణ జరిపిన కోర్టు వాటిని సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వులిచ్చింది. దీంతో ఆ రెండు నియోజకవర్గాల్లో రీపోలింగ్ అవకాశాలు లేవని తేలిపోయింది.

ఏపీలో పల్నాడు ప్రాంతంలో ఎన్నికల వేళ గొడవలు జరిగాయి. సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీ రిగ్గింగ్ చేసిందని ఆరోపించారు మంత్రి అంబటి రాంబాబు. బూత్ క్యాప్చరింగ్ జరిగిందని, నాలుగు పోలింగ్ కేంద్రాల్లో తీవ్ర అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఆ నాలుగు చోట్ల రీపోలింగ్ జరిపించాలని ఆయన ఎన్నికల కమిషన్ ని కోరారు, అదే సమయంలో ఏపీ హైకోర్టుని కూడా ఆశ్రయించారు. అయితే అంబటి పిటిష్ ని హైకోర్టు డిస్మిస్ చేసింది.

తిరుపతి జిల్లా చంద్రగిరిలో కూడా రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రగిరి నియోజకవ్గంలోని పలు పోలింగ్ బూత్ లలో టీడీపీ అక్రమాలకు పాల్పడిందని అన్నారు మోహిత్ రెడ్డి ఈ పిటిషన్ పై కూడా హైకోర్టు విచారణ జరిపి డిస్మిస్ చేసింది. ఎన్నికల తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించిన ఏపీ సీఈఓ ముకేష్ కుమార్ మీనా ఎక్కడా రీపోలింగ్ జరపాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇప్పుడు హైకోర్టు కూడా రీపోలింగ్ కి అవకాశం లేకుండా ఆయా పిటిషన్లను డిస్మిస్ చేసింది. 

Tags:    
Advertisement

Similar News