నిజాయితీని వక్రీకరించడమే ‘ఆంధ్రజ్యోతి’ పని

జగన్‌ బాగా చదువుకున్నవాడు, ఆధునికుడు. ఇలా మాట్లాడడాన్ని వినయం అంటాం. నిజాయితీగా మాట్లాడాడని మెచ్చుకుంటాం.

Advertisement
Update: 2024-01-25 11:11 GMT

‘ఇప్పటికిప్పుడైనా సంతోషంగా దిగిపోతా’ అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్నారు. అంటే ఆయన నిరాశలో కూరుకుపోయి ఉన్నట్టే, ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించినట్టే.. అని ‘ఆంధ్రజ్యోతి’ విపరీతార్థాలు తీసింది. పెద్ద జర్నలిస్టు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన ‘ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌’లో జగన్‌ మాట్లాడుతూ ఈ మాట అన్నారు. మీరు మళ్లీ అధికారంలోకి వస్తారా..? అని రాజ్‌దీప్‌ అడిగితే, ‘‘హోప్‌ ఈజ్‌ స్ట్రాంగర్‌ దెన్‌ రియాలిటీ, 56 నెలలుగా అధికారంలో ఉన్నాను. నేను బెటర్‌గానే చేశానని అనుకుంటున్నా. అయినా, ఇప్పటికిప్పుడయినా సంతోషంగా దిగిపోతా’’ అన్నారు జగన్‌.

జగన్‌ బాగా చదువుకున్నవాడు, ఆధునికుడు. ఇలా మాట్లాడడాన్ని వినయం అంటాం. నిజాయితీగా మాట్లాడాడని మెచ్చుకుంటాం. కర్నాటకలో బీజేపీ ఘోరంగా వోడిపోలేదా..? తెలంగాణలో కేసీఆర్‌ అవమానకరంగా పరాజయం పాలుకాలేదా..?

ఒకవేళ, పరిపాలన బాగానే ఉన్నా, ఓడిపోతే, విచారపడను, దిగిపోతాను అని సూటిగా, వినమ్రంగా చెప్పారు జగన్‌. నిజంగా, ఎన్నికలకు ముందే జగన్‌ ఓటమిని ఒప్పుకున్నట్టయితే, ఈ వార్తని ఆంధ్రజ్యోతి లోపలి పేజీల్లో ఎక్కడో ఓ మూలన చిన్నవార్తగా ఎందుకువేసినట్టు..? మొదటి పేజీలోనే జగన్‌ది పెద్ద ఫొటోపెట్టి, ‘అతనే ఒప్పుకున్నాడు, ఓడిపోతానని’ అని చిందులేస్తూ సెలబ్రేట్‌ చేసుకోవాలిగా..! వాళ్లది ఎలాంటి నిజాయితీ లేని లత్తుకోరు జర్నలిజం అని వాళ్లకే బాగా తెలుసు. వాస్తవాన్ని వక్రీకరించి ఎంత దిగజారుడు రాతలు రాయడానికన్నా సిద్ధం. ఆ మాటల్లో జగన్‌ సూటిదనం, నిజాయితీ, వినమ్రత వాళ్లకి అర్థంకాకకాదు, జనాన్ని ఫూల్స్‌ చేయడానికి..! జగన్ని భ్రష్టుపట్టించే ఎత్తుగడ ఇది..!!

Tags:    
Advertisement

Similar News