బయటకు రాగానే మళ్ళీ మొదలెట్టేశాడా?

కోర్టు పట్టాభికి శుక్రవారం బెయిల్ మంజూరు చేస్తే శనివారం మధ్యాహ్నం బయటకు వచ్చాడు. వచ్చీ రాగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చిపోయాడు. ఇక్కడ విషయం ఏమిటంటే తనను తాను చాలా పెద్ద నేతగా ఊహించుకోవటమే అసలైన సమస్య.

Advertisement
Update: 2023-03-05 05:45 GMT

బెయిల్ మీద బయటకు రాగానే టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మళ్ళీ మొదలుపెట్టేశాడు. వారం రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పట్టాభి గడిపిన విషయం తెలిసిందే. కోర్టు పట్టాభికి శుక్రవారం బెయిల్ మంజూరు చేస్తే శనివారం మధ్యాహ్నం బయటకు వచ్చాడు. వచ్చీ రాగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చిపోయాడు. ఇక్కడ విషయం ఏమిటంటే తనను తాను చాలా పెద్ద నేతగా ఊహించుకోవటమే అసలైన సమస్య.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తనను ఎంత హింసించినా తాను మాత్రం వెనక్కు తగ్గేదిలేదన్నాడు. తప్పుడు కేసులు పెట్టి ఎన్నిసార్లు జైలుకు పంపినా తాను మాత్రం ప్రభుత్వానికి లొంగే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాడు. అసలు పట్టాభిని ప్రభుత్వం ఎందుకు హింసిస్తుంది? ఎందుకు లొంగదీసుకోవాలని అనుకుంటుంది? కార్పొరేటర్‌గా కూడా గెలుస్తాడో లేదో తెలియ‌ని పట్టాభి తనను తాను చాలా పెద్ద నేతగా ఊహించుకుంటున్నాడు. ఈయన వైఖరితో పార్టీలోని ఇతర నేతలు కూడా బాగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు టాక్.

ఇక తోట్లవల్లూరు పోలీసుస్టేషన్లో తనకు ముసుగు వేసి, కరెంటు తీసేసి క్రూరంగా కొట్టినట్లు ఆరోపించాడు. తెల్లవారుజామున 2 గంటల నుండి 5 గంటలవరకు కొట్టారని చెప్పాడు. అయితే పట్టాభిని పరీక్షించిన డాక్టర్లు ఒంటిమీద అసలు గాయాలే లేవని సర్టిఫికేట్ ఇచ్చిన విషయం అబద్ధమా? ఇక్కడ పట్టాభి చిన్న లాజిక్ మరచిపోయాడు. అదేమిటంటే ముసుగు వేసి కరెంటు తీసేసి కొట్టారని చెప్పాడు. కరెంటు తీసేస్తే ముసుగు వేయాల్సిన అవసరం ఏముంటుంది? అలాగే ముసుగు వేస్తే కరెంటు తీయాల్సిన అవసరం ఏముంటింది ?

పైగా మూడు గంటల పాటు క్రూరంగా కొట్టారని చెప్పటం కూడా నమ్మేట్లులేదు. మూడు గంటల పాటు చచ్చేట్లు కొడితే మరుసటి రోజు పోలీసు వ్యాన్‌లో నుండి దిగి కోర్టు హాలులోకి పట్టాభి మామూలుగానే ఎలా నడుచుకుంటు వెళ్ళాడు? ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడి, ఓవర్ యాక్షన్ చేయటం వల్లే సమస్యలో ఇరుక్కున్నాడు. అలాంటిది బెయిల్ మీద బయటకు రాగానే మళ్ళీ అదే పద్ధ‌తిలో మాట్లాడుతున్నాడు. మరీసారి ఏమవుతుందో ఏమో చూడాల్సిందే.

Tags:    
Advertisement

Similar News