ఆదివాసీ మహిళలపై అట‌వీ అధికారుల దాడి…మహిళా కమిషన్ సీరియస్

తెలంగాణలో పోడు భూముల వ్యవహారం వేడి రగులుస్తోంది. ఆదివాసులకు ఫారెస్ట్ అధికారులకు మధ్య యుద్దవాతావరణం నెలకొంది. కొద్ది రోజులుగా ఖమ్మం, మంచిర్యాల , ఆదిలాబాద్ జిల్లాల్లో పోడు భూములు సాగుచేసుకుంటున్న ఆదివాసులపై అటవీశాఖ అధికారుల దాడులు, ఆదివాసుల తిరుగుబాటు అడవిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. నిన్న మంచిర్యాల జిల్లాలో ఆదివాసీ మహిళలపై అటవీశాఖ అధికారులు చేసిన దాడి సర్వత్రా విమర్షలనూ ఎదుర్కొంటోంది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోచగూడలో పోడు భూముల్లో ఆదివాసులు గుడిసెలు వేసుకున్నారు. ఆ గుడిసెలను […]

Advertisement
Update: 2022-07-09 05:37 GMT

తెలంగాణలో పోడు భూముల వ్యవహారం వేడి రగులుస్తోంది. ఆదివాసులకు ఫారెస్ట్ అధికారులకు మధ్య యుద్దవాతావరణం నెలకొంది. కొద్ది రోజులుగా ఖమ్మం, మంచిర్యాల , ఆదిలాబాద్ జిల్లాల్లో పోడు భూములు సాగుచేసుకుంటున్న ఆదివాసులపై అటవీశాఖ అధికారుల దాడులు, ఆదివాసుల తిరుగుబాటు అడవిలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

నిన్న మంచిర్యాల జిల్లాలో ఆదివాసీ మహిళలపై అటవీశాఖ అధికారులు చేసిన దాడి సర్వత్రా విమర్షలనూ ఎదుర్కొంటోంది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోచగూడలో పోడు భూముల్లో ఆదివాసులు గుడిసెలు వేసుకున్నారు. ఆ గుడిసెలను తొలగించడానికి అటవీ శాఖ అధికారులు , 300 మంది పోలీసులను తీసుకొని అక్కడికి వెళ్ళారు. ఆ క్రమంలో పోలీసులకు ఆదివాసీలకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. వర్షాకాలం తలదాచుకోవడానికి గుడిసెలు కూడా వేసుకోనివ్వరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆదివాసీ మహిళలు అటవీ అధికారులకు, పోలీసులకు ఎదురు తిరిగారు. దాంతో మగ పోలీసులు మహిళలపై దాడి చేసి వాళ్ళను ఈడ్చేసి గుడిసెలను తొలగించారు. తర్వాత పలువురు ఆదివాసులను అరెస్టు చేసి తీసుకెళ్ళారు. అలా తీసుకెళ్ళిన సునీత అనే మహిళను అటవీ శాఖ అధికారులు తీవ్ర చిత్రహింసలకు గురి చేశారని ఆమె ఆరోపణలు చేసింది.

ఈ నేపథ్యంలో ఈ సంఘటనపై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. కోయపోచగూడ మహిళలపై, అటవీ అధికారులు, పోలీసులు చేసిన దాడిని కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మా రెడ్డి ఖండించారు. దీనిపై సుమోటోగా విచారణ చేపట్టిన మహిళా కమిషన్ చైర్ పర్సన్, బాధ్యులపై తక్షణం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, రామగుండం పోలీసు కమిషనర్ లను ఆదేశించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వారికి ‍అండగా ఉంటానని సునీతా లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు.

Tags:    
Advertisement