చంద్రబాబూ.. కలల కనకు, ముందస్తు ఉండదు: ఎంపీ విజయసాయి

ఇటీవల ముందస్తు ఎన్నికలపై ప్రతిపక్షాలు తెగ హడావుడి చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టీడీపీ నేతలు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయంటూ హడావుడి చేస్తున్నారు. ఇటీవల చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన మినీమహానాడులోనూ టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు ఎన్నికలపై మాట్లాడారు. మరోవైపు కొన్ని మీడియాల్లోనూ ఈ మేరకు వార్తలు వస్తున్నాయి. కాగా వీటికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘ చంద్రబాబు నాయుడు ముందస్తు […]

Advertisement
Update: 2022-07-07 07:04 GMT

ఇటీవల ముందస్తు ఎన్నికలపై ప్రతిపక్షాలు తెగ హడావుడి చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టీడీపీ నేతలు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయంటూ హడావుడి చేస్తున్నారు. ఇటీవల చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన మినీమహానాడులోనూ టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు ఎన్నికలపై మాట్లాడారు. మరోవైపు కొన్ని మీడియాల్లోనూ ఈ మేరకు వార్తలు వస్తున్నాయి. కాగా వీటికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు.

గురువారం ఆయన తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘ చంద్రబాబు నాయుడు ముందస్తు ఎన్నికలపై తెగ హడావుడి చేస్తున్నారు. త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయని.. తాను ముఖ్యమంత్రిని కాబోతున్నానని ఆయన హడావుడి చేస్తున్నారు. కానీ అంత సీన్ లేదు. ముందస్తు ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదు.

ప్రస్తుతం రాష్ట్రంలో సంక్షేమపాలన నడుస్తోంది. అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరుగుతోంది. ముఖ్యంగా సామాజిక న్యాయంపై ముఖ్యమంత్రి జగన్ దృష్టిసారించారు. అన్ని కులాలకు రాజ్యాధికారంలో భాగం కల్పిస్తున్నారు. ఇక రేపు, ఎల్లుండి జరగబోయే ప్లీనరీ మీటింగ్ ను వైసీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతోంది. భారీగా జనాలు ఈ సమావేశాలకు తరలివస్తారు. ఈ మీటింగ్ చూసి చంద్రబాబు నాయుడు వెక్కి వెక్కి ఏడ్వక తప్పదు.

చంద్రబాబు పగటి కలలు నిజం అయ్యే ప్రసక్తే లేదు. ఆయన ఇంకోసారి ముఖ్యమంత్రి కావడం జరగని పని. ప్రస్తుతం అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారు. ఇక ప్లీనరీ మీటింగ్ లకు గౌరవాధ్యక్షురాలు హోదాలో విజయమ్మ పాల్గొంటారు. దీని మీద అనవసరంగా తప్పుడు ప్రచారం చేయొద్దు’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News