మోడీని వ్య‌తిరేకిస్తే.. దేశాన్ని వ్య‌తిరేకించిన‌ట్టా..?

డబ్బులు ఇచ్చేస్తున్నాం.. అంతకంటే ఎక్కువ డాబులు చెప్పేస్తున్నాం.. ప్రతిపక్షాన్ని నొక్కేస్తున్నాం.. మీడియా నోరెత్తితే తొక్కేస్తున్నాం.. రాజకీయం చేసేస్తున్నాం.. అదిగదిగో గెలిచేస్తున్నాం..! ఇంత కంటే బీజేపీ చేస్తున్న అసలు గొప్ప ఏమైనా ఉందా..!? పైగా “మోదీని వ్యతిరేకిస్తే – దేశాన్ని వ్యతిరేకించినట్టే” అనే ఒక “జాతీయ సెంటిమెంట్” పట్టుకుని సభల్లో మాట్లాడడం.. నడినెత్తిన కళ్ళుంటే నేల కనిపించదు.. ఇప్పుడు చాలా అధికారిక రాజకీయ పక్షాల ఆలోచనలు అలాగే ఉంటున్నాయి.. “రియాలిటీ, ప్రాక్టీకాలిటీ”లను పక్కన పెట్టి ఊహల్లో విహరిస్తున్నారు. బహుశా […]

Advertisement
Update:2022-07-03 05:16 IST

డబ్బులు ఇచ్చేస్తున్నాం.. అంతకంటే ఎక్కువ డాబులు చెప్పేస్తున్నాం.. ప్రతిపక్షాన్ని నొక్కేస్తున్నాం.. మీడియా నోరెత్తితే తొక్కేస్తున్నాం.. రాజకీయం చేసేస్తున్నాం.. అదిగదిగో గెలిచేస్తున్నాం..! ఇంత కంటే బీజేపీ చేస్తున్న అసలు గొప్ప ఏమైనా ఉందా..!? పైగా “మోదీని వ్యతిరేకిస్తే – దేశాన్ని వ్యతిరేకించినట్టే” అనే ఒక “జాతీయ సెంటిమెంట్” పట్టుకుని సభల్లో మాట్లాడడం.. నడినెత్తిన కళ్ళుంటే నేల కనిపించదు.. ఇప్పుడు చాలా అధికారిక రాజకీయ పక్షాల ఆలోచనలు అలాగే ఉంటున్నాయి.. “రియాలిటీ, ప్రాక్టీకాలిటీ”లను పక్కన పెట్టి ఊహల్లో విహరిస్తున్నారు. బహుశా బీజేపీ కూడా ఇప్పుడు అదే పంథాలో ఉండి ఉండవచ్చు. వరుసగా రెండు దఫాలు కేంద్రంలో అధికారం చేతికి రావడం, వచ్చే ఎన్నికల నాటికి కూడా వారికి దీటుగా సరైన ప్రత్యర్థి కనిపించకపోవడంతో కళ్ళు అక్కడే ఉంటాయి, అటువంటి మాటలే వస్తాయి..!

కొత్త చెత్త వాదన..
సంక్షేమ పథకాలు ఇస్తున్నాం.. పేదలను ఉద్ధరిస్తున్నాం.. అని తరచూ చెప్పుకుంటున్న మోడీని ఆయనలో లోపాలు, తప్పులు చెప్పి, విమర్శిస్తే.. దేశాన్ని విమర్శించినట్టే, దేశాన్ని వ్యతిరేకించినట్టే అనే కొత్త చెత్త వాదనను బీజేపీ తెరపైకి తెచ్చింది. దీని ద్వారా దేశంలో రాజకీయ సెంటిమెంట్ రగల్చాలి అనుకుంటుంది.. కానీ..

– పేదలకు రాయితీలో ఇచ్చే వంట గ్యాస్ ని “మొదట రాయితీ బ్యాంకు ఖాతాలో వేస్తామని నగదు బదిలీ పేరు పెట్టి.. ఆ తర్వాత రాయితీలు తగ్గించి.. ఇప్పుడు పూర్తిగా రాయితీలు ఎత్తేసిన” మోడీ పాలనను విమరిస్తే దేశాన్ని విమర్శించినట్టు ఎలా అవుతుంది..!?

– 2014కి ముందు దేశంలో పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెంపునకు నిరసనగా అనేక గోల చేసి.. 2014 నుంచి క్రమేణా ముడి చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ దేశంలో సైలెంట్ గా పెట్రోల్, డీజిల్ ధరలకు అడ్డూ, అదుపు లేకుండా పెంచేస్తున్న” మోడీని విమరిస్తే దేశాన్ని విమర్శించినట్టు ఎలా అవుతుంది..!?

– మొదట జీఎస్టీలో కొన్ని వస్తువులను, కొన్ని వ్యాపార లావాదేవీలను మాత్రమే చేర్చి.. ఆ మీటింగ్ జరుగుతున్న ప్రతీసారి కొత్త వస్తువులను జీఎస్టీలోకి చేరుస్తూ.. రేప్పొద్దున్న దగ్గినా, తుమ్మినా జీఎస్టీ కట్టాలి” అనేంతగా వ్యవస్థలను మార్చేస్తున్న మోడీని విమర్శిస్తే దేశాన్ని విమర్శించినట్టు ఎలా అవుతుంది..!?

– ముస్లిం నాయకుల చేత హిందూ నాయకులను తిట్టించి.. ఆ హిందువుల దగ్గరకు వెళ్లి మేమున్నాం అంటూ మందు రాసి.. మత తత్వ రాజకీయాలను చాటుమాటుగా చేస్తున్న బీజేపీని విమర్శిస్తే.. మోడీని వ్యతిరేకిస్తే.. దేశాన్ని వ్యతిరేకించినట్టు ఎలా అవుతుంది..!?

– మోడీ కూడా ఒక పార్టీ మనిషే, మోడీ కూడా ఒక పార్టీ నాయకుడే.. మోడీ స్వతంత్రం కోసం పోరాడలేదు. మోడీని విమర్శిస్తే.. దేశాన్ని విమర్శించినట్టు అని రాజ్యాంగంలో రాయలేదు, చట్టం చేయలేదు.. సో.., ఎవరి రాజకీయం వాళ్ళది, ఎవరు విమర్శలు వాళ్ళవి..!

తెలంగాణలో పాగా కోసం..!
బీజేపీ ప్రస్తుత ఏకైక అజెండా తెలంగాణాలో అధికారంలోకి రావడమే.. తెలంగాణాలో అధికారం చేపడితే ఆ ఊపుతో పక్కనున్న తమిళనాడు, ఆంధ్ర, ఒడిశా, కేరళ రాష్ట్రాల్లో ఎంతో కొంత ఓటింగ్ పెరుగుతుంది అనేది బీజేపీ లెక్క.. ఉత్తరాదిన బీజేపీకి బలం తగ్గలేదు.. అక్కడక్కడా తగ్గుదల కనిపిస్తున్నా వేరే పార్టీల నాయకత్వాలను, ప్రజాప్రతినిధులను ఇటు చేర్చుకోవడం ద్వారా బలవంతపు బలాన్ని ప్రదర్శించగలుగుతున్నారు.. కానీ దక్షిణాదిన కర్ణాటక తప్ప ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా బీజేపీ బలం పెరగడం లేదు. తెలంగాణ వారికి ఆశాదీపంలా కనిపిస్తుంది.

2018 ఎన్నికల్లో 7 శాతం ఓటింగ్ తో కేవలం ఒక్క అసెంబ్లీ సీటు గెలుచుకున్న బీజేపీ.. ప్రస్తుతానికి ముగ్గురు శాసనసభ్యుల బలంతో ఉంది. ఇక్కడ పూర్తిగా మ్యాజిక్ ఫిగర్ రావడం బీజేపీకి అసాధ్యమే అయినప్పటికి.. 25 సీట్లు వచ్చినా మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్ తరహాలో తన చేతిలోనున్న వ్యవస్థల ద్వారా అధికార పీఠం దక్కించుకోవడం పెద్ద కష్టమేమి కాదని బీజేపీ భావిస్తుంది.

అయితే ఆ 25 సీట్లు రావడం కూడా అంత ఈజీ కాదు. అందుకే బీజేపీ హైదరాబాద్ వేదికగా భారీ కార్యక్రమాలకు పిలుపునిచ్చి, ఆ పార్టీ ముఖ్యులందరూ ఇక్కడకు వస్తున్నారు.. ఇవన్నీ ముందే పసిగట్టిన కేసీఆర్ తన వ్యూహాలతో బీజేపీకి స్ట్రాంగ్ గా చెక్ పెట్టె ప్రయత్నాల్లో ఉన్నారు..!

Tags:    
Advertisement

Similar News