ఈటల భూములు రైతులకు పంపిణీ..

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కి ప్రభుత్వం షాకిచ్చింది. జమున హ్యాచరీస్‌ పేరుతో ఆక్రమించుకున్నారని ఆరోపణలున్న భూముల్ని ప్రభుత్వం రైతులకు పంపిణీ చేసింది. అసలు ఈ కబ్జా ఆరోపణలతోనే ఈటలకు టీఆర్ఎస్ కు మధ్య గ్యాప్ పెరిగింది. ఆయన్ను మంత్రి పదవినుంచి తొలగించారు. అప్పట్లో తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ ఈటల ఎదురు తిరిగారు, కోర్టుమెట్లెక్కారు. చివరకు ఇప్పుడు విచారణ అంతా పూర్తి చేసి ఆ భూముల్ని రైతులకు పంపిణీ చేశారు అధికారులు. మాసాయిపేట మండలం హకీంపేట, అచ్చంపేటలో […]

Advertisement
Update: 2022-06-29 09:13 GMT

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కి ప్రభుత్వం షాకిచ్చింది. జమున హ్యాచరీస్‌ పేరుతో ఆక్రమించుకున్నారని ఆరోపణలున్న భూముల్ని ప్రభుత్వం రైతులకు పంపిణీ చేసింది. అసలు ఈ కబ్జా ఆరోపణలతోనే ఈటలకు టీఆర్ఎస్ కు మధ్య గ్యాప్ పెరిగింది. ఆయన్ను మంత్రి పదవినుంచి తొలగించారు. అప్పట్లో తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ ఈటల ఎదురు తిరిగారు, కోర్టుమెట్లెక్కారు. చివరకు ఇప్పుడు విచారణ అంతా పూర్తి చేసి ఆ భూముల్ని రైతులకు పంపిణీ చేశారు అధికారులు.

మాసాయిపేట మండలం హకీంపేట, అచ్చంపేటలో సర్వే నిర్వహించిన అధికారులు, ఆక్రమణకు గురైన భూముల్ని గుర్తించారు. అచ్చంపేటలో మొత్తం 84 ఎకరాలు, హకీంపేటలో ఎకరం.. మొత్తం 85 ఎకరాల 19 గుంటల భూమి కబ్జాకు గురైందని తేల్చారు. తాజాగా ఆ నివేదికతో వారు జమున హ్యాచరీస్ ప్రాంతానికి వచ్చారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు, నాయకులు.. జమున హ్యాచరీస్ తాళాలు పగలగొట్టుకుని లోపలికి వెళ్లారు. అక్కడే రైతులకు భూమి పట్టాలు పంపిణీ చేశారు ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి.

రైతులందరికీ న్యాయం చేస్తాం..
జమున హ్యాచరీస్ కోసం తాను రైతుల వద్ద భూములు కొనుగోలు చేశామని గతంలో వివరణ ఇచ్చారు ఈటల రాజేందర్. అయితే ఆయన అక్రమంగా వాటిని స్వాధీనం చేసుకున్నారని బాధిత రైతులకు అండగా ఉంటామని, అధికారులతో సర్వే చేయించింది ప్రభుత్వం. సర్వే అనంతరం 65మంది రైతులకు 85 ఎకరాల భూమి పొజిషన్ ఇచ్చినట్టు తెలిపారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. ఈటల రాజేందర్‌ కబ్జా చేసిన భూములను తిరిగి రైతులకు పంపిణీ చేస్తున్నామని, ప్రతి రైతుకు న్యాయం చేస్తామని చెప్పారాయన. కబ్జా చేసిన స్థలాల్లో నిర్మించిన షెడ్ల విషయంలో కోర్టు ఆదేశాలతో నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

Tags:    
Advertisement

Similar News