అగ్నివీరులకు సరే, మాజీ సైనికులకు ఎప్పుడైనా ఉద్యోగాలిచ్చారా ? ఆనంద్ మహీ‍ంద్రాకు మాజీ సైనికాధికారుల ప్రశ్న‌

కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని సమర్దించిన పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా, నాలుగేళ్ళ తర్వాత రిటైర్ అయిన అగ్నివీరులకు తమ సంస్థలో ఉద్యోగాలు కల్పి‍స్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆనంద్ మహీంద్రా ప్రకటనపై విభిన్న అభిప్రాయాలు వస్తున్నాయి. అత్యంత నైపుణ్యం గల మాజీ సైనిక అధికారులకు, సైనికులకు మహీంద్రా గ్రూప్ ఎప్పుడైనా ఉద్యోగాలిచ్చిందా అని పలువురు మాజీ సైనికాధికారులు ప్రశ్నించారు. ‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనల మధ్య, అగ్నివీరులకు తమ ఆహ్వానం పలుకుతున్నట్టు ఆనంద్ మహీంద్రా […]

Advertisement
Update: 2022-06-22 00:02 GMT

కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని సమర్దించిన పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా, నాలుగేళ్ళ తర్వాత రిటైర్ అయిన అగ్నివీరులకు తమ సంస్థలో ఉద్యోగాలు కల్పి‍స్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆనంద్ మహీంద్రా ప్రకటనపై విభిన్న అభిప్రాయాలు వస్తున్నాయి. అత్యంత నైపుణ్యం గల మాజీ సైనిక అధికారులకు, సైనికులకు మహీంద్రా గ్రూప్ ఎప్పుడైనా ఉద్యోగాలిచ్చిందా అని పలువురు మాజీ సైనికాధికారులు ప్రశ్నించారు.

‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనల మధ్య, అగ్నివీరులకు తమ ఆహ్వానం పలుకుతున్నట్టు ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

“అగ్నిప‌థ్ కార్యక్రమం వల్ల జరుగుతున్న హింసాకాండకు చింతిస్తున్నాను. గత సంవత్సరం పథకం ప్రారంభించబడినప్పుడే నేను చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. అగ్నివీరులకిచ్చే శిక్షణ వల్ల వారు అత్యంత క్రమశిక్షణ, నైపుణ్యాలు పొందుతారు. వారికి గొప్ప ఉద్యోగావకాశాలు లభిస్తాయి. అటువంటి శిక్షణ పొందిన, సమర్థులైన యువకులను రిక్రూట్ చేసుకునే అవకాశాన్ని మహీంద్రా గ్రూప్ స్వాగతిస్తోంది.” అని మహీంద్రా ట్వీట్ చేశారు.

మహీంద్రా ట్వీట్ ను పలువురు మెచ్చుకున్నప్పటికీ, మాజీ సైనిక ఉన్నతాధికారులతో సహా కొందరు నెటిజనులు మహీంద్రా గ్రూప్ గతంలో ఎంత మంది మాజీ సైనిక అధికారులను నియమించుకుందో చెప్పాలని అడిగారు.

“మహేంద్ర గ్రూప్, ఈ కొత్త స్కీమ్ కోసం ఎందుకు ఎదురుచూడాలి? ఇప్పటి వరకు, వేలాది మంది అత్యంత నైపుణ్యం కలిగిన, క్రమశిక్షణ కలిగిన మాజీ సైనికులు (జవాన్లు, అధికారులు) ఖాళీగా ఉన్నారు. ప్రతి సంవత్సరం పదవీ విరమణ చేసి, రెండ‌వ కెరీర్ కోసం ఎదిరిచూస్తున్నారు. వారిలో ఎవరికైనా మీరు ఉద్యోగాలు ఇచ్చారా ? ఇస్తే గణాంకాలు చెప్పగలరా? ” అని మాజీ ఇండియన్ నేవీ చీఫ్, చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ మాజీ ఛైర్మన్ అరుణ్ ప్రకాష్ కామెంట్ చేశారు.

“.ఆనంద్ మహీంద్ర గారూ, మాజీ నావికాదళాధిపతి అరుణ్ ప్రకాష్ గారు కోరినట్లుగా మాకు గణాంకాలు ఇవ్వగలరా? నా నలభై ఏళ్ల సర్వీస్ లో ఇలాంటి వాగ్దానాలను వినీ వినీ విసిగిపోయాను” అని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాజీ ఎయిర్ వైస్ మార్షల్ మన్మోహన్ బహదూర్ ట్వీట్ చేశారు.

Tags:    
Advertisement

Similar News