అక్కడ నీళ్ళ కోసం ఓ యుద్దం చేయాలి !

స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ళ తర్వాత కూడా బ్రిటిష్ పూర్వపు సమస్యలతో ప్రజలు ఇంకా సతమతమవడం ఈ దేశపు విషాదం. ఈ రాష్ట్రం ఆరాష్ట్రమనే తేడాలేదు. దేశంలో చాలా చోట్ల కనీస అవసరాల కోసం ప్రజలు పడుతున్న కష్టాలు హృదయవిదారకంగా ఉంటున్నాయి. పై ఫోటో చూడగానే అర్దమవుతుంది అవి నీళ్ళ కష్టాలని. ఇప్పటికీ నీళ్ళ కోసం బరువైన నీళ్ళ కుండలెత్తుకొని కిలోమీటర్ల దూరం నడవడం ఎంతటి అన్యాయమైన విషయం. ఒక వైపు ప్రభుత్వాలు ఇంటింటికీ నీళ్ళు , […]

Advertisement
Update: 2022-06-06 02:44 GMT

స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ళ తర్వాత కూడా బ్రిటిష్ పూర్వపు సమస్యలతో ప్రజలు ఇంకా సతమతమవడం ఈ దేశపు విషాదం. ఈ రాష్ట్రం ఆరాష్ట్రమనే తేడాలేదు. దేశంలో చాలా చోట్ల కనీస అవసరాల కోసం ప్రజలు పడుతున్న కష్టాలు హృదయవిదారకంగా ఉంటున్నాయి. పై ఫోటో చూడగానే అర్దమవుతుంది అవి నీళ్ళ కష్టాలని. ఇప్పటికీ నీళ్ళ కోసం బరువైన నీళ్ళ కుండలెత్తుకొని కిలోమీటర్ల దూరం నడవడం ఎంతటి అన్యాయమైన విషయం. ఒక వైపు ప్రభుత్వాలు ఇంటింటికీ నీళ్ళు , ప్రతి గ్రామానికీ రోడ్లూ, కరెంటు అంటూ చేస్తున్న ప్రచారాల్లోని డొల్లతనాన్ని ఈ చిత్రం తేటతెల్లం చేస్తున్నది.

ఈ చిత్రం మధ్యప్రదేశ్ లోని ఖల్వా బ్లాక్‌లోని ఘుటీఘాట్ గ్రామానికి సంబంధించినది. ఆ గ్రామమే కాదు అక్కడ చుట్టుపక్కల ఏ గ్రామానికైనా తాగడానికే కాదు వాడుకోవడానికి కూడా నీళ్ళు కావాలంటే 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న తపతి నదికి వెళ్ళాల్సిందే.

మధ్యప్రదేశ్, మహారాష్ట్రల మధ్య ప్రవహించే తపతి నది ఇక్కడి ప్రజలకు ఏకైక నీటి వనరు. వేసవి వచ్చిందంటే ఇక్కడి చేతి పంపులు ఎండిపోతాయి. అందువల్ల, ప్రజలు ఎడ్ల‌ బండ్లపై, కాలినడకన తపతి నదికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాల్సి వస్తుంది. అక్కడే స్నానాలు చేసి, బట్టలు ఉతుక్కొని ఆ తర్వాత నీళ్ళు తీసుకొని ఇంటికి వెళ్తారు.

40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలో 3 కిలోమీటర్ల మేర ఇసుక, రాళ్లతో కూడిన నేలపై, పైనుండి వచ్చే ఈదురుగాలులను తట్టుకుని నడవడం ఈ గ్రామ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు ప్రతి రోజూ తప్పని విధి.

ఈ ఫోటో, ఈ వార్త మధ్య ప్రదేశ్ లోని ఓ కుగ్రామానిదే కావచ్చు కానీ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఈ 75 ఏళ్ళ స్వాతంత్య్రం అనేక గ్రామాలకు ఇప్పటికీ కనీసం నీళ్ళు ఇవ్వలేకపోవడాన్ని ఎలా అర్దం చేసుకోవాలి ?

Tags:    
Advertisement

Similar News