తొలిరోజు ముగిసిన టీడీపీ మహానాడు.. 17 తీర్మానాలకు ఆమోదం..

ఒంగోలులో రెండురోజులపాటు జరుగుతున్న టీడీపీ మహానాడు కార్యక్రమం తొలిరోజు 17 తీర్మానాలను ఆమోదిస్తూ ముగిసింది. క్విట్ జగన్ – సేవ్ ఏపీ పేరుతో కీలకమైన రాజకీయ తీర్మానాన్ని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశ పెట్టగా, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి బలపరిచారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు పోరాడాలని పిలుపునిచ్చారు నేతలు. ప్రభుత్వ అసమర్థ, ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు చేయాలని చెప్పారు. అంతకు ముందు మహానాడులో చంద్రబాబు ప్రసంగిస్తూ.. వైసీపీ విధానాలపై తీవ్ర […]

Advertisement
Update: 2022-05-27 11:27 GMT

ఒంగోలులో రెండురోజులపాటు జరుగుతున్న టీడీపీ మహానాడు కార్యక్రమం తొలిరోజు 17 తీర్మానాలను ఆమోదిస్తూ ముగిసింది. క్విట్ జగన్ – సేవ్ ఏపీ పేరుతో కీలకమైన రాజకీయ తీర్మానాన్ని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశ పెట్టగా, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి బలపరిచారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు పోరాడాలని పిలుపునిచ్చారు నేతలు. ప్రభుత్వ అసమర్థ, ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు చేయాలని చెప్పారు.

అంతకు ముందు మహానాడులో చంద్రబాబు ప్రసంగిస్తూ.. వైసీపీ విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ హయాంలో ప్రవేశ పెట్టిన పథకాలను నిలిపివేశారని, పేద ప్రజల కడుపు కొడుతున్నారని ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. అమ్మ ఒడికి నాన్న బుడ్డితో లెక్క సరిపోయిందని, పోలవరం ప్రాజెక్ట్ ప్రాధాన్యతను వైసీపీ విస్మరించిందని అన్నారు. గత 40 ఏళ్లలో టీడీపీ ఎదుర్కొన్న ఇబ్బందులు ఒక ఎత్తు అయితే.. మూడేళ్ల జగన్ పాలనలో ఎదుర్కొన్న ఇబ్బందులు మరో ఎత్తు అని అన్నారు చంద్రబాబు. తనకు సీఎం పదవి కొత్తకాదని, ఎక్కువ కాలం ఆ పదవిలో ఉండే అవకాశాన్ని ప్రజలు తనకు ఇచ్చారని చెప్పారు. ఇప్పుడు పదవులకోసమో, అధికారం కోసమో తాను పాకులాడటం లేదని, రాష్ట్రం నాశమవుతోందనే బాధ తనకు ఉందని, ప్రజలంతా బాధల్లో ఉన్నారని, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్.. ఆ ఒక్క ఛాన్స్‌తోనే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని అన్నారు.

యువతకు అవకాశం..
2024 ఎన్నికల్లో యువతకు ఎక్కువ అవకాశాలిస్తామన్నారు చంద్రబాబు. 40శాతం సీట్లు యువతకు కేటాయిస్తామని చెప్పారు. ఎవరూ టికెట్ల కోసం రికమండేషన్లు చేయించొద్దని, పార్టీకి వారు చేసిన సేవను దృష్టిలో ఉంచుకుని టికెట్ల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. సరైన వ్యక్తులను సరైన స్థానంలో ఉంచుతామన్నారు చంద్రబాబు.

పొత్తులపై నో క్లారిటీ..
2024 ఎన్నికలకు సంబంధించి మహానాడులో పొత్తులపై కీలక ప్రకటన ఉంటుందని అనుకున్నా.. ఆ విషయాన్ని ఎవరూ ప్రస్తావించలేదు. 2024లో పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందా లేక, పొత్తులతో ఇతర పార్టీలను కలుపుకొని వెళ్తుందా అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.

Tags:    
Advertisement

Similar News