శ్రీలంకలో ఎమర్జెన్సీ.. ప్రజలపై ఆంక్షలు..

ఆర్థిక, ఆహార సంక్షోభంతో అల్లాడిపోతున్న శ్రీలంకలో శాంతిభద్రతల సమస్య కూడా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో అత్యవసర పరిస్థితి విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు శుక్రవారం గెజిట్ విడుదల చేసిన ఆయన ఎమర్జెన్సీ తక్షణం అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. ఇటీవల ప్రజలు రోడ్డెక్కి నిరసనలు తెలియజేయడం, ఆందోళనల కార్యక్రమాలు శృతి మించి దాడులకు సైతం తెగబడటంతో అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందు జాగ్రత్తగా.. కొన్నాళ్లుగా శ్రీలంక […]

Advertisement
Update: 2022-04-01 20:46 GMT

ఆర్థిక, ఆహార సంక్షోభంతో అల్లాడిపోతున్న శ్రీలంకలో శాంతిభద్రతల సమస్య కూడా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో అత్యవసర పరిస్థితి విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు శుక్రవారం గెజిట్ విడుదల చేసిన ఆయన ఎమర్జెన్సీ తక్షణం అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. ఇటీవల ప్రజలు రోడ్డెక్కి నిరసనలు తెలియజేయడం, ఆందోళనల కార్యక్రమాలు శృతి మించి దాడులకు సైతం తెగబడటంతో అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ముందు జాగ్రత్తగా..
కొన్నాళ్లుగా శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రోజుకి 13 గంటలసేపు కరెంటు కోత ఉంటోంది. పెట్రోల్, డీజిల్ నిల్వలు నిండుకున్నాయి. రేట్లు భారీగా పెరిగాయి. నిత్యావసరాలు కూడా దొరకడంలేదు. అత్యవసర మందులకి కూడా కరువొచ్చింది. ఉద్యోగులకు జీతాల్లేవు. దీంతో ప్రజలు సహనం కోల్పోయారు. తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. అధ్యక్షుడు రాజపక్స వెంటనే పదవినుంచి దిగిపోవాలంటూ ఆందోళన చేపట్టారు. వేలాది మంది నిరసనకారులు అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టి పోలీసులపై దాడులకు తెగబడ్డారు. ఈ నిరసనలు హింసాత్మకంగా మారడంతో పౌరుల్లో 20మంది గాయపడ్డారు. పరిస్థితి విషమిస్తోందన్న భయంతో అధ్యక్షుడు ఎమర్జెన్సీ ఉత్తర్వులిచ్చారు.

ఎమర్జెన్సీతో ఏమవుతుంది..?
సైన్యం, పోలీసులకు మరిన్ని అధికారాలు వస్తాయి. పౌరుల కదలికలపై నిఘా ఉంటుంది. నిరసనలు, ఆందోళనలు చేపట్టడానికి అవకాశం ఉండదు. కనీసం మీడియాలో కూడా వ్యతిరేక వార్తలు రావడానికి వీల్లేదు. సోషల్ మీడియాపై కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టింది శ్రీలంక ప్రభుత్వం. అరెస్ట్ లను ప్రశ్నించే అవకాశం లేదు. అయితే ఇలాంటి చర్యను ఇతర దేశాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. శ్రీలంకకు ఇతర దేశాలు ఆర్థిక సాయాన్ని చేస్తున్నా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఇదే కొనసాగితే ప్రజలు ఆకలితో చనిపోవడం ఖాయంగా తెలుస్తోంది. ఆందోళనలను అణచివేస్తున్న శ్రీలంక ప్రభుత్వం ఆకలి కేకలు ఆపడానికి ప్రత్యామ్నాయం వెదకాలని ప్రపంచ దేశాలు ఒత్తిడి తెస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News