వివాదం రేపిన విష్ణు.. అంతలోనే 'చిరు' క్లారిటీ

హీరో, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. హీరో చిరంజీవి, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మధ్య జరిగిన మీటింగ్ వాళ్ల వ్యక్తిగతమంటూ సంచలన ఆరోపణ చేశాడు. చిరంజీవి-జగన్ మధ్య జరిగిన భేటీ వాళ్లకు మాత్రమే పరిమితమని, పరిశ్రమకు సంబంధం లేదు అనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశాడు. ఒకరిద్దరు వేరువేరుగా కలిసి, ఆ మీటింగ్ పై తప్పుడు ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదంటూ కామెంట్ చేశాడు. మంచు విష్ణు […]

Advertisement
Update: 2022-02-07 10:05 GMT

హీరో, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. హీరో చిరంజీవి, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మధ్య జరిగిన మీటింగ్ వాళ్ల వ్యక్తిగతమంటూ సంచలన ఆరోపణ చేశాడు. చిరంజీవి-జగన్ మధ్య జరిగిన భేటీ వాళ్లకు మాత్రమే పరిమితమని, పరిశ్రమకు సంబంధం లేదు అనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశాడు. ఒకరిద్దరు వేరువేరుగా కలిసి, ఆ మీటింగ్ పై తప్పుడు ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదంటూ కామెంట్ చేశాడు.

మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలపై పెను దూమారం రేగుతోంది. ఎందుకంటే, సీఎం జగన్ తో భేటీ అయిన తర్వాత స్వయంగా చిరంజీవి, పరిశ్రమ సమస్యలపై స్పందించారు. సిని కళామతల్లి బిడ్డగా జగన్ ను కలిశానని, త్వరలోనే ఇండస్ట్రీ ఓ శుభవార్త వింటుందని ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు. పలు సమస్యలపై కూడా చర్చించిన విషయాన్ని బయటపెట్టారు.

చిరంజీవి అలా చెప్పిన తర్వాత కూడా మంచు విష్ణు ఇలా స్పందించడం ఏమీ బాగాలేదంటూ నెటిజన్లు అభిప్రాయపడ్డారు. అయితే ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే, చిరంజీవి ఇష్యూకు సంబంధించి క్లారిటీ వచ్చేసింది. కుదిరితే ఈనెల 10న సీఎం జగన్ తో సమావేశమయ్యేందుకు చిరంజీవి ప్రయత్నిస్తున్నారు.

నిజానికి ఇంతకంటే ముందే చిరంజీవి, జగన్ ను కలవాలనుకున్నారు. కానీ కరోనా సోకడంతో లేట్ అయింది. ఈసారి తను మాత్రమే కాకుండా.. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల్ని కూడా చిరంజీవి తనతో తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. “దీన్ని కూడా వ్యక్తిగత మీటింగ్ అంటావా విష్ణు” అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది.

Tags:    
Advertisement

Similar News