యూట్యూబ్ ఛానెళ్లపై మంచు విష్ణు ఆగ్రహం

తెలుగు యూట్యూబ్ ఛానెళ్లపై ఆగ్రహం వ్యక్తంచేశాడు నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు. తమ రేటింగ్స్ కోసం ఇష్టారీతిన థంబ్ నెయిల్స్ పెడుతున్నారని, ఇకపై ఇలాంటివి చూస్తూ ఊరుకోనని తెగేసి చెప్పాడు. అసభ్యంగా రాతలు రాసేవాళ్లంతా కోర్టు కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించాడు. “మన హీరోయిన్స్ గురించి యూట్యూబ్ ఛానల్స్ పెట్టే థంబ్ నైల్స్ వలన చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై ఓ లీగల్ సెల్ ఏర్పాటుచేస్తున్నాం. ఎవ్వరూ తప్పించుకోలేరు. అందరి […]

Advertisement
Update: 2021-10-24 07:43 GMT

తెలుగు యూట్యూబ్ ఛానెళ్లపై ఆగ్రహం వ్యక్తంచేశాడు నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు
మంచు విష్ణు. తమ రేటింగ్స్ కోసం ఇష్టారీతిన థంబ్ నెయిల్స్ పెడుతున్నారని, ఇకపై ఇలాంటివి చూస్తూ
ఊరుకోనని తెగేసి చెప్పాడు. అసభ్యంగా రాతలు రాసేవాళ్లంతా కోర్టు కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా
ఉండాలని హెచ్చరించాడు.

“మన హీరోయిన్స్ గురించి యూట్యూబ్ ఛానల్స్ పెట్టే థంబ్ నైల్స్ వలన చాలా మంది ఇబ్బందులు
ఎదుర్కొంటున్నారు. దీనిపై ఓ లీగల్ సెల్ ఏర్పాటుచేస్తున్నాం. ఎవ్వరూ తప్పించుకోలేరు. అందరి
అడ్రస్సులు దొరుకుతాయి. వాళ్లంతా కచ్చితంగా కేసుల ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇకనైనా ఇలాంటి రాతలు ఆపేయండి.”

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా గెలుపొందిన విష్ణు మంచుని, హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లోని మా కార్యాలయంలో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా మాట్లాడిన విష్ణు, పై వ్యాఖ్యలు చేశాడు. తమ ఎజెండాలో చాలా అంశాలున్నాయని, వాటన్నింటినీ ఈ రెండేళ్లలో అమలు చేయడమే తన లక్ష్యం అన్నాడు. ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆర్థిక సహాయం అందించే స్థితిలో లేదని, చందాలు అందుకునే స్థితిలో ఉందన్నాడు విష్ణు.

Tags:    
Advertisement

Similar News